ఈ స్కిన్ కేర్ మిస్టేక్స్ ని మీరు కూడా చేస్తున్నారని మీకు తెలుసా?

మనమందరం వివిధ రకాల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నాము. డ్రై స్కిన్, ట్యాన్, యాక్నే లేదా పింపుల్ స్కార్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇవన్నీ మనకు చాలా సాధారణమైన విషయాలు.

కొన్ని చర్మ సమస్యలు వారసత్వంగా వస్తే మరికొన్ని హార్మోన్ల అసమతుల్యతల వలన ఏర్పడతాయి. మరికొన్ని పొల్యూషన్, ఎండలో ఎక్కువగా ఉండటం వంటి కొన్ని కారణాల వలన కలుగుతాయి.
 చర్మ సమస్యలను నిర్మూలించేందుకు వివిధ హోంరెమెడీస్ ను అలాగే మార్కెట్ లో లభించే వివిధ ప్రోడక్ట్స్ ను ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే, మన నిర్లక్ష్యం వలన తెలీకుండానే మనం చేసే కొన్ని పనుల వలన మన చర్మం దెబ్బతింటుందని మనం సాధారణంగా గ్రహించము.

 స్కిన్ కేర్ రొటీన్ అనేది పనిచేయటం లేదని మీరు అనుకుంటున్నట్టయితే మీ అభిప్రాయం తప్పు. లాంగ్ రన్ లో మీరు స్కిన్ కేర్ పై చూపించే అశ్రద్ధ వలన చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. సాధారణంగా ఈ మిస్టేక్స్ ను తెలియకుండానే చేస్తుంటాము. వీటిని దృష్టిలో పెట్టుకుని చర్మ సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తే చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోగలుగుతాము.

1. పింపుల్స్ ని పాప్ చేయడం: 

తమ ముఖంపై మొటిమలు కనిపించగానే వాటిని తొలగించే వరకు కొందరికి ప్రశాంతత ఉండదు. మొటిమలను చిదిమేయడం వలన సమస్య అంతటితో పరిష్కారమవదు. మీకు మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది ఈ అలవాటు. మొటిమలను చిదిమేయగానే మొదటి సారి అవి మాయమవుతాయి. అయితే, అవి స్కార్స్ ని లేదా డార్క్ స్పాట్స్ ని చర్మంపై వదిలి వెళతాయి. కాబట్టి, నెక్స్ట్ టైం, మొటిమలను చిదిమేసే ముందు కాస్తంత ఆలోచించండి.

2. మేకప్ ను తొలగించకుండా నిద్రలోకి జారుకోవడం: 

బాగా అలసిపోయిన రోజు, మేకప్ ని తొలగించడానికి కూడా బద్దకం అడ్డు వస్తుంది. అయితే, మేకప్ ని తొలగించకపోతే చర్మాన్ని ఇబ్బందిపెట్టినట్లేనని గుర్తుంచుకోండి. మేకప్ అనేది ముఖంపై అదనపు నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందువలన, మీ చర్మం ఆయిలీగా మారుతుంది. రాను రాను చర్మం ఇంఫ్లేమ్డ్ గా మారుతుంది. అందువలన, యాక్నే మరియు పింపుల్స్ ఏర్పడతాయి. కాబట్టి నిద్రపోయే ముందు మేకప్ ని తొలగించుకోవడం మరచిపోకండి.

3. తగినంత నీటిని తీసుకోకపోవటం 

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి మాయిశ్చరైజ్డ్ గా ఉంచేందుకు నీళ్లు అవసరపడతాయి. డిహైడ్రేటెడ్ స్కిన్ అనేది డల్ గా మారి ముడతలకు అలాగే పోర్స్ సమస్యలకు దారితీస్తుందని డెర్మటాలజిస్ట్స్ తెలియచేస్తున్నారు. స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు తగినంత నీటిని తీసుకోవడం మంచిది.

4. అతిగా ఎక్స్ఫోలియేట్ చేసుకోవటం: 

ఎక్స్ఫోలియేషన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ని అరికడుతుంది మనకు తెలిసిన విషయమే. ఎక్స్ఫోలియేషన్ వలన చర్మం టోన్డ్ గా మారి మరింత ప్రకాశవంతంగా తయారవుతుంది. అయితే, ఈ స్కిన్ కేర్ పద్దతిని అతిగా పాటించడం వలన చర్మం మరింత దెబ్బతింటుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఎక్స్ఫోలియేషన్ ను చేయాలి. ఇందుకోసం హోంమేడ్ స్క్రబ్ ను వాడాలి. సులభమైన షుగర్ స్క్రబ్ అటువంటి ఒక మంచి హోంమేడ్
 స్క్రబ్. ఎలా చేయాలి:
 ఇది చాలా సమర్థవంతమైన స్క్రబ్. తయారుచేసుకోవడం కూడా సులభమే. ఒక టీస్పూన్ గ్రాన్యులేటెడ్ షుగర్ లో ఒకటి లేదా రెండు చుక్కల నిమ్మ రసాన్ని లేదా ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవాలి. ఈ రెండిటినీ బాగా కలిపి ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో జెంటిల్ గా స్క్రబ్ చేసుకోవాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ పద్దతిని పాటించాలి.

5. తగినంత నిద్ర లేకపోవటం:

 రాత్రి నిద్రపోని నిశాచరులకి వారి చర్మంపై వారి అలవాటు చూపే ప్రభావం గురించి అంతగా తెలియకపోవచ్చు. తగినంత నిద్ర లేకపోవటం వలన చర్మం దెబ్బతింటుంది. చర్మానికి విశ్రాంతి తీసుకునే సమయం లభ్యమవకపోవటంతో క్లాగ్డ్ పోర్స్ సమస్య వేధిస్తుంది. ఇది బ్రేక్ అవుట్స్ కి దారితీస్తుంది. రోజులో కనీసం 7-8 గంటల నిద్ర లభించేలా జాగ్రత్తలు తీసుకోండి.

6. అపరిశుభ్రమైన గ్లాసెస్ ని ధరించడం వలన: 

కళ్ళజోడు ధరించేవారు తమ గ్లాసెస్ ని తరచూ శుభ్రం చేసుకోవాలి. లేదంటే, దుమ్మూ మరియు బాక్టీరియా అనేది వాటిపై పేరుకుని ముఖంపై పింపుల్స్ మరియు యాక్నే సమస్యను తీసుకువస్తాయి. కాబట్టి, స్కిన్ తో ఆటలాడకండి. కొద్ది నిమిషాల సమయం తీసుకుని గ్లాసెస్ ని శుభ్రం చేసుకుని ఆ తరువాత ధరించండి.

7. సన్ స్క్రీన్ ని వాడకపోవడం: 

సన్ రేస్ చర్మంపై దుష్ప్రభావం ఏ విధంగా చూపిస్తాయో తెలిసినప్పటికీ సన్ స్క్రీన్ ని వాడకపోవటం వలన చర్మం దెబ్బతింటుంది. డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ కి భాగం ఇవ్వటం తప్పనిసరి. కాబట్టి, నెక్స్ట్ టైం ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోవటం మరచిపోకండి.



Comments