మీ చర్మం అందంగా కాంతివంతంగా మెరవాలంటే శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, మృత కణాలను సైతం తొలగించవలసి ఉంటుంది. ఇలా మృతకణాలను తొలగించడం వలన రోజువారీ ఎదుర్కొనే అనేక చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
దీనికి వంటగదిలోనే దొరికే చక్కర ఎంతో మేలు చేస్తుంది. చక్కెరలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడంతో పాటు మృతకణాలను సైతం తొలగిస్తుంది. చక్కరని స్క్రబ్ రూపంలో వాడడం వలన అనేక ఉత్తమఫలితాలను ఇస్తుంది. ఈ స్క్రబ్స్ వాడడం వలన మృత కణాలు తొలగిపోవడంతో పాటు, శరీరానికి సరికొత్త నిగారింపు సంతరించుకుంటుంది.
రోజువారీ దినచర్యలను ఏమాత్రం ప్రభావితం చేయకుండా చర్మ సౌందర్యాన్ని పెంచే 7రకాల స్క్రబ్స్ మీ ముందు ఉంచడం జరిగింది.
ఒక గిన్నెలో 1స్పూన్ కోకోపౌడర్ కు 2టీస్పూన్స్ చక్కర, 2టీస్పూన్ల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంగా చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత సాదా నీటితో కడిగివేయండి. ఇది ముఖాన్ని గట్టిగా పట్టి ఉంచడం లో సహాయం చేస్తుంది. మంచి ఫలితాలకోసం వారంలో రెండు సార్లు చెయ్యవలసి ఉంటుంది.
దీనికి వంటగదిలోనే దొరికే చక్కర ఎంతో మేలు చేస్తుంది. చక్కెరలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడంతో పాటు మృతకణాలను సైతం తొలగిస్తుంది. చక్కరని స్క్రబ్ రూపంలో వాడడం వలన అనేక ఉత్తమఫలితాలను ఇస్తుంది. ఈ స్క్రబ్స్ వాడడం వలన మృత కణాలు తొలగిపోవడంతో పాటు, శరీరానికి సరికొత్త నిగారింపు సంతరించుకుంటుంది.
రోజువారీ దినచర్యలను ఏమాత్రం ప్రభావితం చేయకుండా చర్మ సౌందర్యాన్ని పెంచే 7రకాల స్క్రబ్స్ మీ ముందు ఉంచడం జరిగింది.
1.నిమ్మరసం- చక్కర స్క్రబ్:
తేనె మరియు నిమ్మకాయలు చర్మం పొడిబారకుండా చేసి తేమని పెంచడం ద్వారా నిగారింపుని ఇస్తాయి. ఇది మీరు ఇంట్లో చేసుకోగలిగిన సులభమైన స్క్రబ్. 3స్పూన్ల తేనెలో, 2స్పూన్ల నిమ్మరసం, 2స్పూన్ల చక్కర వేసి మిశ్రమం అగునట్లు బాగా కలపాలి. చేతిలోకి మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వృత్తాకారంలో సున్నితంగా ముఖం నలువైపులా విస్తరించేలా చేయాలి. ఒక పదినిమిషాల అనంతరం సాదా నీటితో కడిగెయ్యాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయవచ్చు.2.ఆల్మoడ్ ఆయిల్ - షుగర్ స్క్రబ్
బాదo నూనెలో విటమిన్C సమృద్దిగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలాన్ని ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది తద్వారా చర్మ సౌందర్యం పెంచుటలో దోహదం చేస్తుంది. ఒక గిన్నెలో 2టీస్పూన్స్ బాదం నూనె తీసుకుని ఒక టీస్పూన్ చక్కరను అందులో మిక్స్ చెయ్యండి. మిశ్రమంగా అయిన తర్వాత వృత్తాకారంలో ముఖంపై నలువైపులా విస్తరించునట్లు అప్ప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగెయ్యాలి. దీనిని వారానికి కనీసం ఒకసారి చొప్పునే మూడు సార్లు చేయాలి.3.అరటిపండు – చక్కర స్క్రబ్
చర్మం హైడ్రేట్ కాకుండా డీహైడ్రేట్ గా ఉంచడంలో అరటిపండు ఏంతో మేలు చేస్తుంది. పైగా విటమిన్ A,B,C ఖనిజాలను సైతం కలిగి ఉంటుంది. అరటిపండుని ముక్కలుగా కట్ చేసి నునుపైన పేస్ట్ వచ్చే వరకు స్పూన్ తో మాష్ చెయ్యాలి. దీనిలో 2స్పూన్ల పంచదారను జోడించి మిశ్రమంగా చేయాలి. దీనిని ముఖానికి మసాజ్ లా సున్నితంగా పట్టించిన తర్వాత 5నిమిషాలు కనీసం వదిలివేయాలి. ముఖంపై పీల్ వేసిన అనుభూతిని కలిగిస్తుంది. తర్వాత చల్లనినీటితో కడిగెయ్యాలి. దీనిని వారంలో రెండు సార్లు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు.4.కొబ్బరి నూనె - షుగర్ స్క్రబ్
కొబ్బరినూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో, మృదువుగా నునుపుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో 3స్పూన్ల కొబ్బరినూనెలో 2టీస్పూన్ల తేనెను మరియు 3టీస్పూన్ల చక్కరను కలపండి. తద్వారా మిశ్రమం అగునట్లు బాగా కలపండి. మిశ్రమాన్ని ముఖానికి పట్టించిన కొద్ది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగెయ్యండి.5.చాక్లెట్- షుగర్ స్క్రబ్
కోకోపౌడర్ లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నకారణంగా మీ చర్మాన్ని సహజమైన నిగారింపుని తీస్కుని రావడంలో సహాయపడుతుంది. దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేయుటలో, ఆరోగ్యవంతంగా మార్చుటలో ఎంతగానో సహాయపడుతుంది.ఒక గిన్నెలో 1స్పూన్ కోకోపౌడర్ కు 2టీస్పూన్స్ చక్కర, 2టీస్పూన్ల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంగా చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత సాదా నీటితో కడిగివేయండి. ఇది ముఖాన్ని గట్టిగా పట్టి ఉంచడం లో సహాయం చేస్తుంది. మంచి ఫలితాలకోసం వారంలో రెండు సార్లు చెయ్యవలసి ఉంటుంది.
Comments
Post a Comment