స్కిన్‌ బ్రేక్‌ అవుట్‌ అవుతోందా! ఇవి కారణం కావొచ్చు!

మీరెంత బాగా మీ చర్మాన్ని చూసుకుంటున్నాఇంకా బ్రేకౌట్స్‌ వస్తున్నాయా? మీసమాధానం అవును అయితే ఈ కథనం మీ కోసమే. మీ చర్మం ఎందుకు బ్రేక్‌ అవుట్‌ అవుతుందో కారణాలు తెలుసుకోండి.

 చాలా మంది మహిళలు తమ చర్మాన్ని కాపాడుకొనేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటారు. గంటలు గంటలు పార్లర్‌లో గడుపుతారు. ఖరీదైన సౌదర్య ఉత్పత్తులను వాడతారు. ప్యాక్స్‌ ఎన్నో వేసుకుంటారు. అయినప్పటికీ వారి చర్మంపై తెల్లని పొక్కుల్లాంటివి ఏర్పడతాయి.

 బాగా ఇబ్బంది పెడతాయి. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. చర్మ గ్రంథులు మూసుకుపోవడం, హార్మోన్లలో మార్పలు, జీవనశైలిలో మార్పులు,పొగ తాగడం వంటి అలవాట్ల వల్ల ఎక్కువగా ఈ బ్రేక్‌ అవుట్‌ సమస్యలు వస్తాయి.

అయితే వీటి నుంచి రక్షించుకోవడానికి, అడ్డుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.

1. అతిగా రుద్దడం

 చాలా మంది తమ చర్మాన్ని అతిగా రుద్దుతుంటారు. ఇది బ్రేక్‌ అవుట్స్‌కు కారణం అవుతుంది. మీరు ముఖం కడుక్కుంటున్నప్పుడు లేదా ఏదైనా ఎక్సోఫోలియేటింగ్‌ మెటీరియల్‌ వాడుతున్నా చాలా సుతారంగా రుద్దుకోవాలి. అప్పుడు మీ చర్మానికి ఎలాంటి హానీ కలగలదు.

2. దిండు కవర్లు మార్చకపోవడం

 నమ్మలేకపోతున్నారా! కానీ నిజం. మీ దిండు కవర్లు తరుచూ మార్చకపోవడం వల్ల స్కిన్‌ బ్రేక్‌ అవుట్స్‌కు కారణం అవుతుంది. దిండు కవర్లలో చాలా వరకు మురికి, అశుద్ధాలు ఉంటాయి. వీటికి ప్రభావం చెందిన చర్మం బ్రేక్‌ అవుట్‌కు కారణం అవుతుంది. అందుకే మీ దిండు కవర్లను శుభ్రం చేసి వినియోగించాలి.

3. మేకప్‌ బ్రష్‌ను శుభ్రపరచకపోవడం

 శుభ్రం చేయని మేకప్‌ బ్రష్‌ల వల్లా ముఖంపై తెల్లని మొటిమలు లేదా ఏస్న్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా మేకప్‌ బ్రష్‌లను శుభ్రం చేయాలి. లేదంటే మీ అందమైన చర్మంపై బ్రేక్‌ అవుట్స్‌ రావడం పక్కా!

4. మీ ఫోన్‌ శుభ్రం చేయకపోవడం

 ఇదీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయమే! మీ స్మార్ట్‌ఫోన్‌ లేదా ఫీచర్‌ ఫోన్‌ను తరుచూ శుభ్రం చేయడం అవసరం. లేదంటే దాని ద్వారా మీ చర్మానికి ఇన్ఫెక్షన్‌కు గురవుతుంది. ఇదీ స్కిన్‌ బ్రేక్‌ అవుట్‌కు దారితీస్తుంది. అందుకే మీ ఫోన్‌ ద్వారా ఇన్ఫ్‌క్షన్‌ వ్యాపించకుండా చూసుకోండి.

5. చుండ్రు ఉన్నా అంతే

 అవును! మీ జుట్టులో చుండ్రు ఉన్నా స్కిన్‌ బ్రేక్‌ అవుట్‌కు అది కారణం అవుతుంది. చాలా మంది తల వెంట్రుకల్లో ఉండే చుండ్రు వంటి ఇబ్బందులు ద్వారా స్కిన్‌ బ్రేక్‌ అవుట్‌తో బాధపడతారు.

6. తరచూ మీ ముఖం తడుముకుంటున్నారా

 మనం చేతుల్లో ఉండే గ్రంథుల ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు బయటకు వస్తాయి. అలాంటి చేతుత్తో మీ ముఖాన్ని రుద్దుకుంటే దాని ద్వారా క్రిములు, బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తాయి. అంతిమంగా అది స్కిన్‌ బ్రేక్‌ అవుట్‌కు దారి తీస్తుంది. అందుకే బాగా శుభ్రం చేసుకున్న తర్వాతనే మీ చర్మాన్ని ముట్టుకోండి.

7. గడువు తీరని మేకప్‌ కిట్‌ 

మేకప్‌ సామగ్రికీ ఎప్పటి వరకు వినియోగించాలో గడువు తేదీ ఉంటుంది. అంతలోపే వాటిని వాడాలి. అలా కాకుండా గడువు తీరిన మేకప్‌ సామగ్రిని ఉపయోగిస్తే అవి మీ చర్మాన్ని బాధపెడుతుంది. బ్రేక్‌ అవుట్‌కు దారి తీస్తుంది. అందుకే గడువు తీరని మేకప్‌ సామగ్రిని వినియోగించకండి.

8. కసరత్తు చేసి తర్వాత ముఖం కడగకపోవడం

 క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం వల్ల మీ చర్మంలో అద్భుతాలు జరుగుతాయన్నది వాస్తవం. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అదే మీ చర్మానికి ఇబ్బందులు కలిగిస్తుంది. చెమట ఎక్కువ సేపు మీ చర్మంపై ఉంటే అది లోపలికి ఇంకిపోయి కొత్త సమస్యలకు దారితీస్తుంది. బ్రేక్‌ అవుట్‌కు కారణం అవుతుంది. అందుకే ఎక్సర్‌సైజ్‌ చేయగానే చర్మాన్ని శుభ్రం చేసుకొని తేలికపాటి మాయిశ్చరైజర్‌ రుద్దుకుంటే మంచిది.



Comments