ఉల్లిపాయః జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఏకైక ప్రభావవంతమైన చిట్కా !

దశాబ్దాల వరకు, ఉల్లిరసాన్ని జుట్టు ఊడిపోవటం తగ్గటానికి శక్తివంతమైన చిట్కాగా భావిస్తూ వస్తున్నారు. ఉల్లిపాయలో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక, ఫంగస్ లక్షణాలు మెరుగైన జుట్టు ఎదుగుదలకి సాయపడుతుంది. అది మీ జుట్టు కుదుళ్లకి పోషణనిచ్చి, కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తుంది.

అది కేవలం జుట్టు ఊడిపోవటంకి మాత్రమే కాదు, ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు సమయానికి ముందే నెరవడాన్ని, చుండ్రును కూడా నయం చేస్తాయి. డైటరీ సల్ఫర్ బలమైన మరియు వత్తైన జుట్టు పెరగటానికి చాలా ముఖ్యమైన పోషకం, మరియు అది ఉల్లిరసం రాసుకోవటం వలన వస్తుంది. అది ఇలా పనిచేస్తుంది ;
a.సల్ఫర్ అమినోయాసిడ్లలో, ప్రొటీన్లలో భాగంగా ఉంటుంది.

 b.సల్ఫర్ ఎక్కువగా ఉండే ప్రొటీన్లలో ఒకటి కెరాటిన్ మరియు ఇది బలమైన జుట్టు పెరగటాన్ని ప్రోత్సహిస్తుంది.

 c. ఉల్లిరసం మీ జుట్టుకు అదనపు సల్ఫర్ ను అందించి జుట్టు మరింత పెరిగేలా చేస్తుంది, నెరవటాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తుంది.

ఉల్లిని వాడి జుట్టు ఊడటం నివారించే అనేక పద్ధతుల లిస్టును అందించాం. చదవండి...

1.ఉల్లిరసం రాసుకోవడం 

ఇది అన్నిటికన్నా ప్రాథమిక పద్ధతి. ఉల్లిపాయ తొక్కుతీసి నాలుగు ముక్కలు చేయండి. దీన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్ళు పోయండి. మిక్సీపట్టాక వడగట్టి ఈ రసాన్ని మీ జుట్టుకి పట్టించండి. గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేయండి. ఒక గంట అలానే ఉంచేసి తర్వాత షాంపూతో కడిగేయండి. ఇది ఉల్లిరసపు వాసనను తొలగిస్తుంది. 2 నెలల్లో ఒక వారం చొప్పున ఇలాచేసి ఫలితం చూడండి.

2. తేనె మరియు ఉల్లిరసం

 ఎప్పుడూ క్రమంతప్పకుండా ఉల్లిరసాన్ని రాయటమే కాక, మీరు దానిలో ఇతర పదార్థాలను కూడా కలిపి మెరిసే జుట్టు కోసం హెయిర్ ప్యాక్ లా తయారుచేయవచ్చు. పావు కప్పు ఉల్లిరసాన్ని తీసుకుని ఒక చెంచా తేనె కలపండి. దాన్ని మీ కుదుళ్ళకి రాయండి. అరగంట అలానే ఉంచి షాంపూతో కడిగేయండి.

3. ఆలివ్ నూనె మరియు ఉల్లిరసం

 ఆలివ్ నూనెను ఎందుకు చెప్తారంటే అది జుట్టు కుదుళ్ళలోపలికి ఇంకి, జుట్టుకి పోషణనందిస్తుంది. అంతేకాక, దానిలో ఉండే చుండ్రు వ్యతిరేక లక్షణాలు అదనపు లాభం!

 3చెంచాల ఉల్లిరసం తీసుకుని అందులో ఒకటిన్నర చెంచా ఆలివ్ నూనె కలపండి.ఈ మిశ్రమాన్ని బాగా తలకి మసాజ్ చేసి రెండు గంటల తర్వాత కడిగేయండి. ఈ పద్దతిని బలమైన, చుండ్రు లేని జుట్టు కోసం ప్రయత్నించండి.

4. ఉల్లిరసం మరియు కరివేపాకు: 

కరివేపాకు జుట్టు రాలడం తగ్గిస్తుంది, తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.కరివేపాకును మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

5. పెరుగు మరియు ఉల్లిరసం

 పెరుగు జుట్టుకి మెరుగైన పోషణ అందిస్తుందని మరియు జుట్టూ ఊడిపోవటాన్ని తగ్గిస్తుందని ప్రసిద్ధి.సమాన మొత్తాలలో పెరుగు మరియు ఉల్లిరసాన్ని ఒక బౌల్ లో కలపండి. దీన్ని మీ జుట్టుకి రాసుకుని ఒక గంట తర్వాత కడిగేయండి.

కానీ ఉల్లిరసం బట్టతలను కానీ ఇంకేదన్నా జుట్టు సమస్యలని కానీ నయం చేయదు. కానీ జుట్టు మెరుగ్గా పెరగటానికి ఉల్లిరసం మంచి చిట్కా. ప్రయత్నించి తేడా మీరే చూడండి!


Comments