న‌ల్ల‌ని అండ‌ర్ ఆర్మ్స్‌తో ఇబ్బందా? బేకింగ్ సోడాతో ఈ టిప్స్ పాటిస్తే స‌రి

చాలా మంది యువ‌తుల‌కు స్లీవ్ లెస్ దుస్తులు ధ‌రించి క‌ళాశాలల్లో, వేడుక‌ల్లో, కార్యాల‌యాల్లో ఆధునికంగా క‌నిపించాల‌ని కోరిక ఉంటుంది. అంద‌మైన డిజైన్ దుస్తులు ధ‌రించాల‌ని ఎంతో ఆశ‌గా ఉంటారు. కానీ చంక‌ల్లో న‌ల్ల‌ధ‌నం, చ‌ర్మం మందంగా ఉండ‌టం, న‌ల్ల‌ని అండ‌ర్ ఆర్మ్స్ వ‌ల్ల సిగ్గు ప‌డుతూ త‌మ కోరిక‌ల‌ను చంపేసుకుంటారు. ఇలాంటి స‌మ‌స్యే మీరూ ఎదుర్కొంటున్న‌ట్ట‌యితే ఈ క‌థ‌నం మీకోసమే! ఇందులో న‌ల్ల‌ని అండ‌ర్ ఆర్మ్స్‌ను మీ చ‌ర్మం రంగుతో స‌రిపోయేలా చేసేకునే సింపుల్ మార్గాలు ఇస్తున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం చ‌దివేయండి మ‌రి!

న‌ల్ల‌ని అండ‌ర్ ఆర్మ్స్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం బేకింగ్ సొడా. అవును! మీరు చ‌దివింది నిజ‌మే! వంట‌ల్లో ఎక్కువ‌గా వాడే ఈ బేకింగ్ సోడా చంక‌ల్లో న‌ల్ల‌ధ‌నాన్ని పోగొట్టి మెరుపునిస్తుంది. చ‌ర్మంలో మృత క‌ణాలు ఉండ‌టం, త‌రుచూ షేవింగ్ చేసుకోవ‌డం వ‌ల్ల‌నే అండ‌ర్ ఆర్స్మ్‌లో చ‌ర్మం న‌ల్ల‌గా, మందంగా మారుతుంది.
బేకింగ్ సోడా ఎక్సోఫిలేటింగ్ కార‌కంగా ప‌నిచేస్తుంది. అంటే చ‌ర్మంలోని మృత క‌ణాల‌ను తొల‌గించి, శుభ్ర‌ప‌రిచి అండ‌ర్ ఆర్మ్స్ చ‌ర్మం రంగును తేలిక చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఇన్ఫెక్ష‌న్స్‌ను దూరం చేస్తాయి. మీ అండ‌ర్ ఆర్మ్స్‌మ‌రింత ఆరోగ్యంగా, మెరుపులీనేలా చేస్తుంది.

 అండ‌ర్ ఆర్మ్స్‌ను తెల్ల‌గా మార్చుకునేందుకు బేకింగ్ సోడాను ఎలా ఉప‌యోగించాలో ఇక్క‌డ ఇస్తున్నాం. కింద తెలిపే మార్గాల్లో ఏదైనా స‌రే ఉప‌యోగించి మీ అండ‌ర్ ఆర్మ్స్ ముదురు రంగును మార్చేసుకోండి.

1. బేకింగ్ సోడా పేస్ట్‌

 ఉప‌యోగించే విధానం: ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను రెండు టేబుల్ స్పూన్ల నీటితో బాగా క‌ల‌పండి. ఆ మిశ్ర‌మాన్ని మీ అండ‌ర్ ఆర్మ్స్‌లో సున్నితంగా ప‌ట్టించండి. 15 నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకుంటే స‌రిపోతుంది. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఇలా చేస్తే తెల్ల‌ని అండ‌ర్ ఆర్మ్స్ మీ సొంతం అవుతాయి.

2. బేకింగ్ సోడా, కొబ్బ‌రి నూనె 

ఉప‌యోగించే విధానం: మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను బాగా క‌ల‌పండి. దానిని సుతారంగా మీ అండ‌ర్ ఆర్మ్స్‌కు ప‌ట్టించండి. 15 నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేసుకోండి. రెండు వారాల‌కు ఒక‌సారి ఈ మిశ్ర‌మాన్ని మీ అండ‌ర్ ఆర్మ్స్‌కు ప‌ట్టిస్తే నిగారింపు సొంతం అవుతుంది.

3. బేకింగ్ సోడా, గ్లిజ‌రిన్‌

 ఉప‌యోగించే విధానం: రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌ను బాగా క‌లిపి లోష‌న్ మాదిరిగా త‌యారు చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని న‌ల్ల‌గా ఉన్న అండ‌ర్ ఆర్మ్స్‌లో ప‌ట్టించాలి. 15 నిమిషాల త‌ర్వాత వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక‌సారి ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

4. బేకింగ్ సోడా, కార్న్‌స్టార్చ్‌, విట‌మిన్ ఈ నూనె 

ఉప‌యోగించే విధానం: ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌స్టార్చ్‌, రెండు విట‌మిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి తీసిన నూనెను బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దానిని మీ అండ‌ర్ ఆర్మ్స్‌కు సుతారంగా మ‌ర్ద‌న చేయాలి. 15 నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల‌కు ఒక‌సారి ఇలా చేస్తే అండ‌ర్ ఆర్మ్స్ తెల్ల‌గా మార‌తాయి.

5. బేకింగ్ సోడా, పాలు

 ఉప‌యోగించే విధానం: రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వేడి చేయ‌ని పాల‌లో క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని అండ‌ర్ ఆర్మ్స్‌కు ప‌ట్టించాలి. 15 నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల‌కు ఒక‌సారి ఈ మిశ్ర‌మాన్ని ప‌ట్టిస్తే మంచి ఫ‌లితాలు క‌నిపిస్తాయి.

6. బేకింగ్ సోడా, దోస‌కాయ‌

 ఉప‌యోగించే విధానం: రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దోస‌కాయ గుజ్జుతో మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. దానిని స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్న అండ‌ర్ ఆర్మ్స్‌లో ప‌ట్టించాలి. 15 లేదా 20 నిమిషాలు ఉంచుకొని వేడి నీటితో క‌డిగేసుకోవాలి. ప్ర‌తి వారం ఇలా చేస్తే అండ‌ర్ ఆర్మ్స్‌లో చ‌ర్మం నిగారింపు సంత‌రించుకుంటుంది.

7. బేకింగ్ సోడా, అవ‌కాడో

 ఉప‌యోగించే విధానం: అవ‌కాడో పండును పూర్తిగా స‌న్న‌గా తుర‌మాలి. దానిని రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాతో ఒక పేస్ట్‌గా త‌యారు చేసుకోవాలి. 20 నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. నెల‌లో రెండు సార్లు చంక‌ల్లో ఈ విశ్ర‌మాన్ని ప‌ట్టిస్తే ఆశ్చ‌ర్య పోవ‌డం మీ వంతు అవుతుంది.




Comments