విటమిన్-సి ఆయిల్, మీ మొటిమలకు చికిత్సను అందించగలదా?

మొటిమలు మహిళల యొక్క జీవితాల్లో ఏదో ఒక సమయంలో, ఎదుర్కోవలసిన సమస్యగా ఉంది. ఈ మొటిమలు ప్రారంభ దశ నుండే చిరాకును కలిగివుండి అంత త్వరగా నయం కావు. చర్మంపైన ఈ మొటిమలు ఏర్పడిన తర్వాత ఇది జిగటుగా ఉండటం వల్ల దీన్ని వదిలించుకోవడం చాలా కష్టం. కానీ ప్రకృతి ప్రతి దాని కోసం ఒక నివారణను కలిగి ఉంటుంది.

 చర్మం ఉపరితలం పైన రంధ్రాలు అధిక ఉత్పత్తి చేయడం వల్ల, అక్కడున్న చర్మ రంధ్రాలలో అడ్డుపడేలా ఉండటం వల్ల మొటిమలు ఏర్పడతాయి. ఈ చర్మరంధ్రాల్లో నివసిస్తున్న సాధారణమైన బ్యాక్టీరియా కొవ్వు పదార్ధం తో కూడిన శ్లేష్మం ఉత్పత్తిని బాగా పెంచుతుంది.

ఈ బ్యాక్టీరియా ముఖము యొక్క వేర్వేరు భాగాలకు వ్యాపిస్తుంది, దానితోపాటు మోటిమలు కూడా వ్యాప్తి చెందుతాయి. ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఈ ప్రక్రియను ఆపడానికి, ఇందుకు మూలమైన బ్యాక్టీరియాను చెప్పడం చాలా అవసరం. మహిళల్లో ఏర్పడే ఈ మొటిమలను నయం చేయడానికి సాధారణంగా చర్మవ్యాధి నిపుణుడిని కలుస్తారు.

 చర్మం నుండి ఉత్పత్తి కాబడిన శ్లేష్మములు పొడిగా చెయ్యటం మరియు దానికి కారణమైన బ్యాక్టీరియాను చంపే మందులను డాక్టర్లు సూచిస్తారు. ఈ మందులను తరచుగా వాడటం వల్ల పొడిగా, కఠినంగా మరియు పొరలుగా ఉండే చర్మాన్ని ఏర్పరుస్తాయి. అంతేకాకుండా, అవి సమర్థవంతంగా పని చెయ్యటానికి చాలా సమయం పడుతుంది మరియు శాశ్వతమైన ఫలితాలను పొందగలమని చెప్పడానికి ఎలాంటి హామీ లేదు.
అందువల్ల చర్మ నిపుణులు, మందుల యొక్క చెడు ఫలితాలు లేకుండా మొటిమలను సురక్షితంగా, ప్రభావవంతంగా పరిష్కరించడం కోసం బ్యాక్టీరియాను చంపి, అధిక శ్లేష్మమును ఉత్పత్తి చెయ్యకుండా ఉండే వివిధ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఈ సమస్యకు సైన్సు పరంగా ఎలాంటి పరిష్కారం లభించలేదు కానీ, అటువంటి లక్షణాలను విటమిన్-సి రూపంలో కలిగి ఉన్నట్టు గా చెబుతున్నారు.

 విటమిన్-సి అద్భుతమైన చర్మ ప్రయోజనాలను కలుగజేయడంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో చాలా రకాల యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి మరియు దీర్ఘకాలంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను అద్భుతంగా పరిష్కరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మొటిమలను నివారించడంలో - ఆయిల్ రూపంలో లభిస్తోన్న విటమిన్-సి యొక్క ప్రయోజనాలను ఇటీవల కాలంలో గుర్తించబడినది. ఏ రకమైన ఆయిలైనా మొటిమలను పెంచుతున్నాయి, కానీ విటమిన్-సి విషయంలో మాత్రం అది నిజం కాలేదు.

ఆయిల్ రూపంలో వున్న విటమిన్-సి మొటిమలను నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ ద్వారా మొటిమలను నివారించడానికి అనుసరించవలసిన కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి మీరు చూడండి.

1. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది : 

విటమిన్-సి లో యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది సమస్యలను సృష్టించే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. ఇది చర్మం ఉపరితలం పై ఉన్న దుమ్మును మరియు వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.

2. ఇది నాన్-కామెడోజెనిక్ : 

నాన్-కామెడోజెనిక్ పదార్థాలు, మోటిమలు కలిగించే చర్మానికి నిజంగా ఒక వరం లాంటిది. ఇది చర్మం రంధ్రాలను మూసివేస్తుంది, అలా మరిన్ని మోటిమలను తగ్గించేలా చేస్తుంది.

3. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది :

 విటమిన్-సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అంటువ్యాధుల నుండి చర్మానికి నష్టం వాటిల్లకుండా ఉండటంలో సహాయపడుతుంది. ఇది కూడా చర్మాన్ని రిపేర్ చేస్తుంది మరియు మోటిమల వల్ల చర్మానికి కలిగిన నష్టాన్ని తగ్గిస్తుంది.

4. ఇది వాపును తగ్గిస్తుంది: 

మోటిమలు వలన ఏర్పడిన చర్మము ఉపరితలమందు కేశనాళికల ద్వారా రక్తము ప్రవహిస్తూ వెళ్తున్నందున ఆ ప్రాంతం ఎర్రగా మారుతుంది. విటమిన్-సి ఆయిల్, చర్మము యొక్క ఉపరితలంపై ప్రసరిస్తున్న రక్తాన్ని తగ్గిస్తుంద, తద్వారా ఆ ప్రాంతంలో ఏర్పడిన ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

5. ఇది సులభంగా శోషించదగినది:

 ఈ ఆయిల్ సులభంగా చర్మంలోనికి చేరుతుంది. ఇది చర్మంపై నుండి, చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి, మొటిమల కారణంగా చర్మం యొక్క మొదళ్ళకు ఏర్పడే నష్టాన్ని సరిచేస్తుంది.

6. ఇది శ్లేష్మము యొక్క ఉత్పత్తిని తగ్గిస్తుంది: 

ఇక్కడ ఒక ఆయిల్, మరొక ఆయిల్ను చంపుతుంది. చర్మంపై ఉత్పత్తి కాబడుతున్న శ్లేష్మము అక్కడ ఇప్పటికే ఉన్నందున, సేబాషియస్ గ్రంథులు మరింత ఆయిల్ను ఉత్పత్తి చేయలేవు, తద్వారా మోటిమలు ఏర్పడే అవకాశాలను బాగా తగ్గిస్తాయి.

7. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది:

 విటమిన్-సి ఆయిల్, మోటిమలకు చికిత్సలో మాత్రమే ఉపయోగపడదు, కానీ ఆ మొటిమల వల్ల సాధారణంగా ఏర్పడిన ఘోరమైన మచ్చలను ఈ ఆయిల్ బాగా తగ్గిస్తాయి. ఈ ఆయిల్ చర్మ సంరక్షణలో భాగంగా మొటిమలను నివారించిన తర్వాత కూడా, దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.





Comments