ఈ రోజుల్లో, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది అత్యంత సాధారణ సమస్యగా మారిపోయింది. సరైన ఆహారనియమాలను పాటించకపోవడం, పొల్యూషన్ తో పాటు మరికొన్ని అంశాలు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కి దారితీస్తాయి. చాలామందిలో, ఇరవైలలోనే శిరోజాలు తెల్లబడడం ప్రారంభమవటాన్ని మనం గమనించవచ్చు.
మొట్టమొదటి సారి తెల్లవెంట్రుకను గుర్తించడం కాస్తంత బాధాకరమైన విషయమే. సాధారణంగా, వృద్ధుల్లోనే తెల్లవెంట్రుకలు గమనించటం వలన చిన్నతనంలోనే తెల్లవెంట్రుకలు కనిపించడం వలన కాస్తంత ఆందోళనకు గురవుతాము. ఇరవైలలోనే వృద్ధుల లక్షణాలని ఎవరూ కోరుకోరు కదా?
జుట్టు త్వరగా తెల్లబడడానికి అనేక అంశాలు కారణమవుతాయి. పోషకాహార లోపం, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, స్ట్రెస్ తో పాటు స్మోకింగ్ వంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కి కారణమవుతాయి.
హెయిర్ మరియు స్కిన్ పై దుష్ప్రభావం చూపే స్మోకింగ్ కి మీరు దూరంగా ఉండాలి. తద్వారా, మీ శిరోజాల్లో అలాగే చర్మంలో సహజసిద్ధమైన మెరుపును గమనించగలుగుతారు.
తెల్ల జుట్టు నివారణకు 8 ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్
మెలనిన్ లోపం తలెత్తినప్పుడు వెంట్రుకలు తెల్లబడతాయి. శిరోజాలకు రంగును అద్దే పదార్థం మెలనిన్. వయసుతో పాటు మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువలన, శిరోజాల రంగు గ్రే గా మారుతుంది. కొన్నాళ్లకు, మెలనిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది.
ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ను అరికట్టే కొన్ని సమర్థవంతమైన హోంరెమెడీస్ ను ఇక్కడ పొందుపరిచాము. వీటిని పరిశీలించండి.
1. ఆమ్లా:
ఆమ్లా లేదా ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగినవి. ఆమ్లాని తీసుకోవడం ద్వారా అలాగే ఆమ్లాని అప్లై చేసుకోవడం ద్వారా మీరు గుర్తించదగిన మార్పులను గమనించగలుగుతారు. ఆమ్లాని అప్లై చేయాలనుకుంటే కొన్ని ఆమ్లా ముక్కలను కొబారినూనెలో బాయిల్ చేయాలి. ఈ ఆమ్లా ముక్కలు డార్క్ కలర్ లోకి మారినప్పుడు ఆయిల్ ను వడగట్టాలి. ఇప్పుడు ఈ నూనెను చల్లారనివ్వాలి. ఆ తరువాత, ఈ నూనెతో స్కాల్ప్ పై మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా ఈ ఆయిల్ ను తలపై ఉండనిచ్చి మరుసటి ఉదయాన్నే మీ రెగ్యులర్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
2. ఆనియన్ జ్యూస్:
కేటలైజ్ అనే ఎంజైమ్ ఆనియన్స్ లో పుష్కలంగా లభిస్తుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ను అరికట్టేందుకు ఈ ఎంజైమ్ సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. స్కాల్ప్ పై కాస్తంత ఆనియన్ జ్యూస్ తో రబ్ చేస్తే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ను అవాయిడ్ చేసే అవకాశం ఉంది. హెయిర్ డైస్ అందుబాటులో లేనప్పుడు ఈ ట్రిక్ ను పూర్వకాలంలో విపరీతంగా అమలుచేసేవారు. స్కాల్ప్ లో కేటలైజ్ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఆనియన్ జ్యూస్ ఉపయోగకరంగా ఉంటుంది. మీ హెయిర్ ను వాష్ చేసే ముందు ఈ విధంగా హెయిర్ ను ట్రీట్ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.
3. కొబ్బరి నూనె:
జుట్టుకు సంబంధించిన ఇబ్బందులను తొలగించుకునేందుకు కొబ్బరి నూనెను వినియోగించుకోవచ్చు. ఇది స్కాల్ప్ లోకి ఇంకిపోగలదు. తద్వారా, స్కాల్ప్ కి అలాగే హెయిర్ కి తగినంత పోషణను అందించి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ను అరికడుతుంది.
4. హెన్నా:
అత్యద్భుతమైన హెయిర్ డై గా హెన్నా పనిచేస్తుంది. హెయిర్ కు డార్క్ రంగును అద్దుతుంది. అలాగే, ఇది మాయిశ్చరైజర్ గా అలాగే కండిషనర్ గా పనిచేసి హెయిర్ ను బలపరుస్తుంది. కాస్తంత క్యాస్టర్ ఆయిల్ ను, నిమ్మరసాన్ని అలాగే హెన్నాని కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే నీళ్లను కలిపి పలచగా తయారుచేసుకోవచ్చు. శిరోజాలకు ఈ మిశ్రమాన్ని పట్టించి రెండు గంటల తరువాత హెయిర్ ను వాష్ చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
5. బ్లాక్ టీ:
హెయిర్ కలర్ ను డార్క్ చేసేందుకు బ్లాక్ టీ రెమెడీ అత్యద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, శిరోజాలకు మెరుపును కూడా అద్దుతుంది. కొన్ని టీ లీవ్స్ ను నీటిలో వేసి మరిగించాలి. ఆ తరువాత టీ డార్క్ కలర్ లో మారాక వడగట్టాలి. దీనిని హెయిర్ కు అప్లై చేసి గంటపాటు అలాగే ఉండనివ్వాలి. రెగ్యులర్ షాంపూతో హెయిర్ ని వాష్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఈ రెమెడీని పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్ పొందవచ్చు.
6. కర్రీ లీవ్స్:
హెయిర్ కు పిగ్మెంటేషన్ ను జోడించేందుకు కర్రీ లీవ్స్ సహాయపడతాయి. ఎనిమిది కర్రీ లీవ్స్ ని కొబ్బరినూనెలోమరిగించాలి. లీవ్స్ బాగా వేగే వరకూ బాయిల్ చేయాలి. ఆ తరువాత నూనెను వడగట్టి చల్లారనివ్వాలి. ఈ నూనెతో స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ ని వారానికి ఒకసారి హెయిర్ ని వాష్ చేసేముందు అప్లై చేయాలి.
చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్యకు ఇంట్లోనే పరిష్కారం..!
7. కాఫీ:
టీతో పాటు కాఫీ కూడా హెయిర్ కి డార్క్ రంగును అద్దడానికి ఉపయోగపడుతుంది. కాఫీ పౌడర్ ని నీటిలో కలిపి బాయిల్ చేయాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని శిరోజాలకు అప్లై చేయాలి. గంట తరువాత హెయిర్ ను వాష్ చేయాలి. ఈ మిక్స్ ను హెయిర్ ని వాష్ చేసిన తరువాత హెయిర్ రిన్స్ గా కూడా వాడవచ్చు. అలాగే హెయిర్ కండిషనర్ గా కూడా వాడవచ్చు. అయితే, నీటిలోంచి కాఫీ పౌడర్ ను వడగట్టడం మరచిపోకండి. ఈ రెమెడీ వలన జుట్టులోంచి కాఫీ ఫ్లేవర్ కూడా వస్తుంది.
8. రోజ్ మేరీ మరియు సేజ్:
ఈ రెండు హెర్బ్స్ కి గ్రే హెయిర్ ని అరికట్టే సామర్థ్యం కలదు. ఈ రెండు హెర్బ్స్ ని కలిపి బాయిల్ చేయండి. ఆ తరువాత కొన్ని గంటల పాటు వీటిని చల్లారనివ్వండి. ఈ హెర్బ్స్ ని వడగట్టి ఈ మిక్స్ ని హెయిర్ వాష్ చేసుకున్న తరువాత ఫైనల్ రిన్స్ గా వాడి హెయిర్ ను కండిషన్ చేసుకోండి. హెయిర్ ని వాష్ చేసిన ప్రతి సారి ఈ చిట్కాను పాటించండి. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ని అరికట్టే ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాము. బోల్డ్ స్కై ని పాటించి ఇటువంటి అద్భుతమైన సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి.
Comments
Post a Comment