స్త్రీలలో వయస్సు మీరుతున్న మొదటి లక్షణాలు ఏమిటి?

మీరేదో ఒకరోజు పొద్దున్న లేవగానే మీ చర్మం మొత్తం ముడతలు పడిపోయి లేదా సాగిపోయినట్లు అయిపోదు. చర్మం యొక్క వయస్సు మీరటం అనేది చాలా నెమ్మదైన ప్రక్రియ, దీన్ని మొదటి స్టేజి నుంచి సంరక్షించాలి.

మీరు మీ చర్మాన్ని వయస్సు మీరే లక్షణాలకి వదిలేసి, అదంతట అదే ఒక మాయా మంత్రదండంతో నయం అయిపోవాలని ఊహిస్తే- అలాంటివేవీ భూమ్మీద నిజంగా జరగవు. అన్ని వయస్సు మీరే లక్షణాలను తగ్గించే కాస్మెటిక్స్ మరియు ఇంటి చిట్కాలు వయస్సు మీరుతున్న చర్మంపై మొదటి నుంచి సహనంతో ప్రయత్నిస్తేనే పనిచేస్తాయి.
అద్దం ముందు నుంచుని మీ ముఖాన్ని పరిశీలించినప్పుడు , మీకు మీ చర్మం వయస్సు మీరుతున్న లక్షణాలు కన్పించకపోవచ్చు. ఇది ఎందుకంటే ఆ లక్షణాలు మొదట ఇతర భాగాలలో కన్పించి తర్వాత ముఖంపై కన్పిస్తాయి.

అందుకని మీ మొహం కాక, ఇతర అవయవాలపై ఈ వయస్సు మీరుతున్న లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం. ఇతర భాగాలపై ఏ లక్షణాలు మీరు గమనించవచ్చో ఇక్కడ వివరంగా ఇవ్వబడింది. చదవండి.

నుదురు 

మీ మొహంలో అన్నిటికన్నా చదునుగా ఉండే ప్రాంతం, నుదురు మొదటగా వయస్సు మీరే లక్షణాలను ముడతలు పడ్డ చర్మంతో సూచిస్తుంది. మీకు సరిగ్గా కన్పించకపోతే అద్దంలోకి నేరుగా చూడండి. కానీ మీరు కనుబొమ్మలను కదిపి, ఆ ప్రాంతపు చర్మాన్ని మసాజ్ చేసినట్లు చేస్తే, అక్కడ చర్మం అమరిక మారినట్లు అన్పిస్తుంది, ఇలా 30ఏళ్ల తర్వాత సాధారణంగా జరుగుతుంది. దీన్ని మీ చర్మం వయస్సు మీరే లక్షణాలలో ఒకటిగా తీసుకోవాలి మరియు దానికి వెంటనే పరిష్కారం ప్రయత్నించాలి.

మెడ 

సాగి వేలాడుతుండే మెడ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కానీ అక్కడే వయస్సు మీరటం మొదలవుతుంది. ఆగకుండా పట్టే చెమట, ఎండలో ఎక్కువ తిరగడం మరియు మెడను ఎవరూ ఎక్కువగా సంరక్షించుకోకపోవటం వలన, మెడ మొదటగా వయస్సు మీరే లక్షణాలను చూపిస్తుంది. మీ ముఖాన్ని అద్దంలో బాగా పరిశీలించండి.విడిగా కూడా చేత్తో పరిశీలించండి, మీకు వేరేలాగా అన్పించవచ్చు. మెడపై చర్మం ముడతలను నయం చేయటానికి అనేక చిట్కాలున్నాయి కానీ అన్నీ సరైన సమయంలోనే చేయాలి.

చేతులు 

వయస్సు మీరే లక్షణాలను మొదటగా చూపే శరీర అవయవం చేతులు. మీ చేతులపై, ముఖ్యంగా అరచేతులు, ట్రైసెప్స్ భాగంలో పరిశీలించండి, ఇక్కడే మీకు లక్షణాలు కన్పిస్తాయి. చేతులపై వయస్సు మీరే లక్షణాలను తగ్గించటానికి క్రీములు మరియు మాయిశ్చరైజర్లను మొదటి స్టేజిలో ప్రయత్నించడం వలన తగ్గించవచ్చు. అది ఫలితాన్ని ఇస్తున్నట్లు అన్పించకపోతే చేతి వ్యాయామాలు కూడా చేయవచ్చు.

మోకాళ్ళు

 మీ మోకాళ్ల చుట్టూ చర్మం మందంగా మరియు లూజుగా ఉంటుందని ఎప్పుడన్నా గమనించారా? అందుకని, అక్కడే మొదట వయస్సుమీరే లక్షణాలు కన్పిస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తున్నప్పుడు, 30 ఏళ్ళ తర్వాత ముఖ్యంగా , మీ మోకాళ్ళకి మరియు దాని చర్మానికి ప్రత్యేక సంరక్షణ ఇవ్వండి. మీ మోకాళ్ళపై ముడతలు మరియు సన్నగీతలు కన్పించినప్పుడు, అది మీ వయస్సు మీరడానికి లక్షణాలుగా తీసుకోండి. మోకాళ్లపై వయస్సు మీరే లక్షణాలను తగ్గించటానికి శరీర నూనెలతో మసాజ్ చేయటం చాలా సింపుల్ పద్ధతి.

స్తనాలు

 స్త్రీలు వయస్సు మీరుతున్న లక్షణాలను మొదటగా తమ స్తనాలపై చూడవచ్చు. స్తనాలు వదులుగా, మెత్తగా, సాగిపోయినట్లు అయిపోతాయి. దాని చుట్టూ చర్మం ముడతలు పడిపోయి, మీ బ్రా సైజు మారిపోవచ్చు. ఇంటి చిట్కాలతో నయం చేయడానికి ప్రయత్నించి, తర్వాత స్తనాలను నిలబెట్టే క్రీములు మరియు నూనెలను ప్రయత్నించవచ్చు. వీటి చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, అందుకని మీ చర్మనిపుణుడిని సంప్రదించటం ముఖ్యం.


Comments