చలి కాలంలో మృత చర్మం తొలగించే సాధారణ చిట్కాలు
మృత చర్మం చలికాలంలో ఏర్పడుతుంది. ఈ సమస్య వల్ల చాలా మంది పొడి చర్మం సమస్యతో బాధపడుతుంటారు . పొడి చర్మం వల్ల చర్మంపై రాషెస్ మరియు చర్మ పగుళ్లు ఏర్పడుతాయి. దీని వల్ల బధపడకుండా, ఏజింగ్ వల్ల మరియు చలికాలంలో చలికి పొడి స్కిన్ వల్ల చర్మంలో వచ్చే చర్మ సమస్యలు, ముడుతలను నివారించడానికి వివిధ రకాల ఫేస్ మాస్కులు అందుబాటులో ఉన్నాయి.పొడి చర్మం వల్ల బాధపడేవారికోసం మేం కొన్ని ఫేస్ప్యాక్లను అందిస్తున్నం.
గృహ సంబంధ సహజసిద్ధ ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ మాస్క్ లు చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా మరియు తాజగా ఉంచుతాయి . ఈ ఫేస్ మాస్క్ లను ఇంట్లో తయారుచేయడం చాలా సులభం మరియు వీటిని రెగ్యులర్ గా వాడటం వల్ల కొన్ని వారాల్లోనూ మెరిసేటి చర్మ కాంతిని పొందవచ్చు . చలికాలంలో పొడి చర్మం , ముడుతలను మాయం చేసే గృహ సంబంధ సహజసిద్ధ ఫేస్ ప్యాక్ చూద్దామా..యాంటీఆక్సిడెంట్ మాస్క్
ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాక అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది . 1/2బొప్పాయి, 1/4చెంచా నిమ్మరసం, 1/2చెంచా తేనె గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మెడకు పట్టించిన తర్వాత 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.కీరదోసకాయ మరియు పెరుగు ఫేస్ మాస్క్
తొక్క తీసిన కీరదోసకాయను మెత్తగా గ్రైండ్ చేసి అందులో 1చెంచా పెరుగు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అవొకాడో, తేనె మాస్క్
ఒక అవొకాడో పండులోని సగాన్ని మెత్తగా మ్యాష్ చేసి, ఈ పేస్ట్ కు 2 చెంచాల తేనె, మరియు అరచెంచా కొబ్బరి నూనె మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 5నిముషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఓట్ మీల్ మరియు పెరుగు మాస్క్
ఇది చర్మాన్ని మృదువుగా మార్చి మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది . ఇది ముడతలను కూడా నివారిస్తుంది . 2 చెంచాల ప్లెయిన్ పెరుగు, 1 చెంచా తేనె, 1/3 కప్పు ఓట్ మీల్ పౌడర్, 1/2 హాట్ వాటర్ మిక్స్ చేసి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.స్ట్రాబెర్రీ మరియు లెమన్ ఫేస్ మాస్క్
అరకప్పు స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి అందులో 1 చెంచా తేనె, ఒక చెంచా పెరుగు, 2చెంచాలా లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పాల క్రీమ్ మరియు తేనె
పొడి అలాగే గరుకు చర్మం ఉన్నవారు ప్రధానంగా చలికాలంలో ఈ ఫేస్ మాస్క్ మీ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది . ఒక చెంచా పాలమీగడలో మరియు 1 చెంచా తేనె మిక్స్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు గ్రీన్ టీ మాస్క్
3 చెంచాల గ్రీన్ టీ లో 1 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్, 2 చెంచాలు పెరుగు, 1 చెంచా ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment