మీకు దీర్ఘకాలం మెరిసే చర్మాన్ని అందించే ఫుడ్స్!

మనలో చాలామందికి డల్ స్కిన్ ఉంటుంది. ఇలా మొండి చర్మాన్ని కలిగివుండటానికి అనేక రకాల కారణాలున్నాయి. అయితే వాటిలో కొన్ని పూర్ డైట్, మోయిస్తర్ లేకపోవడం, వివిధ రకాల పర్యావరణ కారకాలు మరియు చర్మ సంరక్షణకు అవసరమైన ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడం వంటివి ఇలా చాలానే వున్నాయి.

 తక్కువ ఉష్ణోగ్రత మరియు తేమ చర్మం నుండి తేమను తీసుకొని, చర్మాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా, మనం రోజువారీ తినే ఆహారాల పదార్థాలు కూడా ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడంలో భారీ వ్యత్యాసాన్ని కలిగివుంటాయి.
మనం మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డల్ గా వున్న చర్మాన్ని కాపాడుకోవచ్చు, ఇంకా సన్ డామేజ్, ముడుతలు, ఫైన్ లైన్స్, సాగిన చర్మం నుండి చర్మాన్ని రక్షించడానికి మనకి సహాయపడుతుంది.

మీ చర్మం అందంగా ఆరోగ్యంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీ చర్మాన్ని ప్రకాశింపచేసే కొన్ని ఆహారాలు వున్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఈ ఆహార పదార్థాలు మన చర్మానికి అవసరమైన వివిధ పోషక అవసరాలను తీర్చడానికి రోజూ సహాయపడతాయి.

అందువలన, ఈ ఆర్టికల్లో, తేమను లాక్ చేయడం ద్వారా మరియు పొడిని నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడే కొన్ని సూపర్ఫుడ్ల జాబితా ను మీకోసం సిద్ధం చేసాము.

వాటి గురించి మరింత తెలుసుకోవడాన్ని చదవండి మరియు ఈరోజు నుండి మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను జత చేసుకోండి. మీ స్కిన్ ప్రకాశవంతంగా తయారు చేసే సూపర్ ఫుడ్స్

బ్రోకలీ:

 బ్రోకలీ ఆరోగ్యవంతమైన మెరిసే చర్మంను ప్రోత్సహిస్తుంది. ఇందులో విటమిన్ C మరియు A లను కలిగివుండటం వలన ఇది చర్మాన్ని కాపాడుతుంది. ఇంకా విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మరొక వైపు, విటమిన్ A UV కిరణాల డామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

ఆలివ్ ఆయిల్: 

చర్మం మీద ఆలివ్ నూనె అద్భుతాలను చేస్తుంది. ఇది విటమిన్లు A, E మరియు ఇతర సహజమైన కొవ్వు ఆమ్లాలకి మంచి మూలం గా చెప్పవచ్చు . ఇది చర్మంను హైడ్రేట్ చేయడానికి మరియు అందంగా సాఫ్టుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు ఆరోగ్యకరమైన గ్లోను అందిస్తుంది.

ద్రాక్ష:

 ద్రాక్షలో ఉండే విటమిన్ సి పదార్థం ప్రతిక్షకారినిగా పనిచేస్తుంది మరియు ఫ్రీ రాడికల్ డామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ద్రాక్షలో వుండే లైకోపీన్ మీ చర్మం మృదువుగా మరియు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. దీనిలో వుండే ఫోటోకాఎమికల్ కాలేయం నుండి విషాన్ని తొలగిస్తుంది, తద్వారా ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం ఏర్పడుతుంది.

స్పినాచ్: 

స్పినాచ్ అసంఖ్యాకమైన ఆరోగ్య మరియు అందం యొక్క ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన అన్ని పోషకాలతో నిండి ఉంటుంది. ఇది చర్మపు వృద్ధాప్య ప్రక్రియతో పోరాడుతుంది, చర్మపు టోన్ను మెరుగుపరుస్తుంది, అంతేకాకుండా మీ చర్మం తిరిగి యవ్వన రూపాన్ని పొందడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ: 

యాంటీఆక్సిడెంట్స్ గ్రీన్ టీ లో అధికంగా ఉండటం వలన ఇది ఫ్రీ రాడికల్ డామేజ్ ని నిరోధిస్తుంది మరియు ముడుతలతో, సున్నితమైన లైన్స్ మరియు సాగిన చర్మం వంటి వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది. ఇంకా గ్రీన్ టీ లో పొడిబారిన మరియు ఫ్లాకీ చర్మాన్ని నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.



Comments