సోయాతో ముఖంలో మెరుపులే...మెరుపులు

మీరు అద్దంలో చూసుకొన్నప్పుడు మీకు అయిష్టంగా అగుపించవచ్చు. ? ఎందుకో తెలుసా ముఖంలో ముడుతలు మరియు చర్మం చూడటానికి రఫ్ గా మరియు మొటిమలతో చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది . చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే బ్యూటీ ఉత్పత్తులన్నీ అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పవు.

 అందుకు చింతించాల్సిన అవసరం లేదు. చర్మ సంరక్షణకు సోయా గ్రేట్ గా సహాయపడుతుంది. సోయా ఫేస్ క్లెన్సర్ ఫేషియల్ స్కిన్ హెల్త్ కు మ్యాజిక్ చేస్తుంది. అది ఎలా మ్యాజిక్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది మ్యాజికల్ పద్దతుల గురించి తెలుసుకోవాల్సిందే...

సోయా ఓట్స్ క్లెన్సర్: 

వాతావరణంలోని కాలుష్యం వల్ల చర్మంలో మచ్చలు, మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది . సోయా మిల్క్ లో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఎక్సెస్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. సోయాతో ఓట్స్ చేర్చడం వల్ల ఇది చర్మం మీద స్క్రబ్బింగ్ గా పనిచేసి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ ఫేస్ క్లెన్సర్ తయారుచేసుకోవడానికి ఈ క్రింది పదార్థాలను పొడి చేసుకోవాలి. 1 cup సోయా మిల్క్, ½ cup ఓట్స్ పౌడర్ , 1 tbsp తేనె, 1 tsp ఆరెంజ్ బ్లోసమ్ ఎసెన్షియల్ ఆయిల్ . అన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి రెండు మూడు వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు చర్మానికి పట్టించి స్క్రబ్ చేసుకోవచ్చు.

లావెండర్ మరియులెమన్ ఎసెన్సియల్ ఆయిల్: 

ఎసెన్షియల్ ఆయిల్ చర్మాన్ని స్మూత్ గా చేస్తుంది మరియు చర్మంలోపలి నుండి సాఫ్ట్ చేస్తుంది. ఈ ఫేషియల్ క్లెన్సర్ కు సోపులను ఉపయోగించుకోవచ్చు . అంటే దీన్ని చాలా సింపుల్ గా క్లెన్సింగ్ ఫేస్ వాష్ గా ఉపయోగించుకోవాలి . దీన్ని తయారుచేసుకోవడానికి కావల్సిన పదార్థాలు..1 cup సోయా మిల్క్, 2 tbsp తేనె, 3 tbsp ఆలివ్ ఆయిల్ , 1 tbsp షీ బట్టర్, 1 tsp సిట్రిక్ యాసిడ్, 10 చుక్కల లావెండర్ ఆయిల్ , 10 చుక్కల లెమన్ ఆయిల్, 3 tbsp క్యాస్టైల్ సోప్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిచడం వల్ల చర్మానికి ఎక్స్ట్రా సాఫ్ట్ అండ్ సఫెల్ గా వస్తుంది. డ్రై స్కిన్ ను ఉన్నవారు, దీన్ని ఫేస్ క్లెన్సర్ గా ఉపయోగించుకోవచ్చు.

సోయా -పెరుగు క్లెన్సర్ 

పెరుగు లాక్టిక్ యాసిడ్ కలిగి ఉంటుంది . ఇది చర్మంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది మరియు ఇది చిన్న పాటి ఎక్స్ఫ్లోయేట్ గా పనిచేస్తుంది . ఈ క్లెన్సర్ కోసం తేనెను ఉపయోగించుకోవచ్చు . దీన్ని ఏ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం అయినా ఉపయోగించుకోవచ్చు . ఈ క్లెన్సర్ తయారుచేసుకోవడం కోసం , ఈ క్రింది తెలిపిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ½ cup సోయా పెరుగు, 2 tsp తేనె, 2 tbsp బట్టర్ మిల్క్, 1 tbsp కాస్టర్ ఆయిల్ తీసుకొని మొత్తం మిశ్రమాన్ని బ్లెడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు

కోక అండ్ సోయా: 

ఇది చాలా మంచి క్లెన్సర్ . ఈ రెండింటి మిశ్రమం చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది ఒక ఔన్స్ కో బటర్ ను కరిగించి, అందులో సోయా బీన్ ఆయిల్ మిక్స్ చేయాలి. అవసరం అనుకుంటే గ్లిజకరిన్ కూడా వేసి మిక్స్ చేయాలి . సువాసనకోసం కొన్ని చుక్కల జరానియ్ రోజ్ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు . ఈ బాడీ బట్టర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఒక 5నిముషాల తర్వాత తడి బట్టతో తుడిచేసుకోవాలి . మురికి మరియు ఆయిల్ తొలగిపోతుంది.

సోయా ఎక్స్ ఫ్లోయేటర్: 

బాగా అలసిన రోజున మరియు ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు సింపుల్ గా క్లెన్సింగ్ చేసుకోవడం ఒకటే సరిపోదు . చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవాలి. ఈ క్రింది పదార్థాలలో ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి. ½ cup సోయా మిల్క్, 4 tbsp గ్రౌండ్ నట్ మగ్ ను మిక్స్ చేి ముఖానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి. 5 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

సోయా ఫేస్ క్లెన్సర్ తో ప్రయోజనాలు 

సోయా మిల్క్ ను ముఖానికి క్లెన్సర్ గా ఉపయోగించడం వల్ల పొందే లాభాలు ఈ క్రింది విధంగా 1. నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది: ఇది మీ చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఎక్కువ సమయం గ్లామరస్ గా కనబడేలా చేస్తుంది. చర్మాన్ని పొడబారకుండా చేస్తుంది. చర్మంలో పొట్టు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది . దీన్ని ఎక్స్ ఫ్లోయేటర్ అంటారు

డి పిగ్మెంటేషన్ 

వయస్సు పెరిగే కొద్ది, చర్మంలో అనేక మార్పులు వస్తాయి. స్కిన్ స్పాట్స్, మరియు పిగ్మెంటేషన్ సన్ బర్న్ వంటి సమస్యలు చుట్టుముడుతాయి . వీటినివారణకు డజన్ల కొద్ది ఉత్పత్తులను వాడి మీరు అలసిపోయి ఉండవచ్చు , కానీ సోయా మిల్క్ ఉపయోగించుకొనే సమయం వచ్చింది . ఏ.జ్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ముడుతలు సోయా మిల్క్ క్లెన్సర్ ద్వారా మాయం అవుతాయి

కొత్త చర్మం ఉత్పత్తి అవుతుంది: 

బయట అడుగు పెట్టడానికి ముందు బ్యూబ్ ల కొద్ది క్రీమ్ లను అప్లై చేయడం కంటే సోయా మిల్క్ ను అప్లై చేస్తే స్కిన్ రీజనరేట్ అవుతుంది . ఇది చర్మంను యంగ్ గా కనబడేలా చేస్తుంది. సోయా మిల్క్ లో విటమిన్ ఇ, చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు తేమగా ఉంచుతుంది . సోయా బీన్ స్కిన్ సెల్స్ ను రీజనరేట్ చేస్తుంది.

చర్మానికి కావాల్సినంత తేమను మరియు కాంతిని అందిస్తుంది

 సోయా మిల్క్ లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది చర్మం క్రింద కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది . కొల్లాజెన్ ఉత్పత్తి వల్ల స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది ,. చర్మానికి అవసరం అయ్యే తేమను అందిస్తుంది . దాంతో చర్మం వయస్సైనట్లు కనబడనివ్వదు . సాఫ్ట్ అండ్ సపెల్ స్కిన్ పొందవచ్చు






Comments