చర్మానికి హాని చేసే - చెడు చర్మ సంరక్షణ అలవాట్లను మీరు ఖచ్చితంగా విడిచిపెట్టాలి !

మీ రోజువారీ చర్మ సంరక్షణ (స్కిన్ కేర్) అలవాట్లు అనేవి మీ ముఖం పైన మరియు ఇతర శరీర భాగాల్లో కూడా కనిపిస్తాయి. ఈ అలవాట్లు మీ చర్మాన్ని మచ్చలేని, అందమైన వాటిగా గానూ (లేదా) అనారోగ్యకరంగానూ మరియు నిస్తేజంగానూ కనపడేలా చేస్తాయి.

 మీరు సరైన చర్మ సంరక్షణను నిత్యమూ అనుసరించినట్లయితే, మీ చర్మానికి ఎక్కువ నష్టం కలిగించగల కొన్ని అలవాట్లు కూడా దాగుని ఉన్నాయి, అవి మీరు వికారంగా కనపడేటందుకు మరియు మీ చర్మం పగిలిపోయేటట్లుగా ఉండటానికి కారణమవుతాయి.
అలాంటి చర్మ సంరక్షణ అలవాట్లు 'ఏమిటో' అని మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన వాటిని, మేము మీ ముందుకు తీసుకువచ్చాము. ఈరోజు బోల్ద్స్కీ వద్ద, మీ చర్మానికి హాని కలిగించే - కొన్ని రకాలైన చర్మ సంరక్షణ అలవాట్లను ఎలా అయిన సరే మీరు ఖచ్చితంగా నిరోధించాలి.

 ఈ అలవాట్లు బాహ్యంగా కనిపించే చర్మంపైన మరియు దాని ఆరోగ్యంపైన దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి.

ఈ కింద పేర్కొన్న అలవాట్ల నుంచి విముక్తులవ్వడం ద్వారా, మీరు మీ చర్మాన్ని మరింతగా సంరక్షించుకోవచ్చు. ఆ అలవాట్లు ఏంటో మీరు చూడండి:

1. మేకప్ తో పడుకోవటం : 

మనలో చాలామంది ఏదో ఒక సమయంలో (లేదా) ఇతర పరిస్థితుల్ల కారణంగా అలంకరణతో నిద్రిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, హానికరమైన చర్మ సంరక్షణ అలవాట్లలో ఇది ఒకటి. కాబట్టి దీన్ని మీరు తప్పక విడిచిపెట్టాలి. చర్మ సంరక్షణ కోసం వాడే ఉత్పత్తి సాధనాలలో హానికరమైన రసాయనాలను కలిగి ఉండటం వల్ల, ప్రతికూల ప్రభావాలను కలుగజేసి అది మీ చర్మానికి మరియు దాని యొక్క ఆరోగ్యాన్ని నష్టపరుస్తుంది.

2. చర్మాన్ని మితిమీరి శుభ్రపరచడం :

 చర్మ సంరక్షణ నిపుణులు చెప్పిన దాని ప్రకారం, చర్మాన్ని శుభ్ర పరచడం అనేది చాలా మంచి చర్య.

అలా అని చర్మాన్ని మితిమీరి శుభ్రపరచడం వల్ల మీ చర్మానికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరిగే అవకాశం ఉంది. ఇలా అతిగా శుభ్రం చేయడంవల్ల చర్మంలో సహజంగా ఉండే ఆయిల్స్ను తీసివేసి, మీ చర్మానికి మరింత ఎక్కువగా హాని కలిగిస్తుంది.

అలా జరగకుండా ఉండాలంటే రోజులో 2 సార్లు మాత్రమే మీ చర్మాన్ని శుభ్ర పరచడం మంచిది.

3. మొటిమలను చింపడం (లేదా) పిండడం :

 మొటిమలను చింపడం (లేదా) పిండడం అనేది ఒక సులభమైన పరిష్కార మార్గంలా కనిపించినప్పటికీ, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది మరియు అవాంఛనీయమైన మొండి మచ్చలు కలగటానికి దారితీస్తుంది. చర్మ సంరక్షణలో మొటిమలను చింపడం అనేది ఒక భాగంగా ఉన్నా, అలా చెయ్యడం మంచిది కాదు. దానికి బదులుగా, ఇంటి చిట్కాలను ఉపయోగించి ప్రయత్నించండి (లేదా) మొటిమలను పోగొట్టే మందులను వాడటం మంచిది.

4. మీ కళ్ళు చుట్టూ ఉన్న వలయాలను అలానే వదిలివేయటం : 

మీ కళ్ళు చుట్టూ ఉన్న చర్మం చాలా పలుచగా మరియు సున్నితమైనదిగా ఉంటుంది. అయినప్పటికీ, చాలా మంది మహిళలు దీనిపై తగిన శ్రద్ధను చూపించటం మర్చిపోతే, అది నల్లని వలయాలకు, ఉబ్బిన కళ్ళు మాదిరిగానూ మరియు ముడుతలుగా కనపడటానికి దారితీస్తుంది. మీ చర్మ సంరక్షణ అలవాటును కలిగి వుండటం వల్ల మీ కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు గల ప్రాంతం అన్ని సమయాల్లో మిమ్మల్ని రిఫ్రెష్ గానూ మరియు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

5. సన్-స్క్రీన్ ను సరిగ్గా వాడకపోవడం వల్ల : 

సన్-స్క్రీన్ ను సరిగ్గా వాడకపోవడం అనేది ఒక చెడు చర్మ సంరక్షణ అలవాటు. ఇది వికారమైన చర్మ పరిస్థితులకు దారి తీస్తుంది. సూర్య కిరణాలు చాలా కఠినంగా కనిపించకపోతే చాలా మంది మహిళలు సన్-స్క్రీన్ల వాడకాన్ని దాటవేస్తారు; ఏది ఏమైనప్పటికీ, సూర్య కిరణాలు నేరుగా మీ చర్మాన్ని తాకి, కొంత భాగానికి హాని కలిగించవచ్చు మరియు వివిధ అవాంఛిత చర్మ సమస్యలకు దారితీయవచ్చు.

6. చర్మ సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం :

 ఇది మీ చర్మం యొక్క రూపాన్ని మరియు ఆరోగ్యాన్ని నాశనం చేసే మరొక సాధారణమైన చెడు చర్మపు సంరక్షణ అలవాటు. చాలా ఎక్కువ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మీ చర్మానికి మంచిది కంటే ఎక్కువ హానిని కలుగచేయవచ్చు. ఇది చర్మానికి సహజంగా ఉండే తేమను మరియు సహజ సౌందర్యాన్ని తగ్గించేలా చేస్తుంది. కాబట్టి, అందుబాటులో ఉండే అన్ని రకాల సౌందర్య సాధనాలను వాడటం కన్నా, మీ చర్మం ఎల్లప్పుడూ నిగారించేటట్లుగా మరియు ప్రకాశవంతంగా ఉండేటట్లు చేసే ఉత్పత్తులను సరిగ్గా నిర్ధారించుకొని ఉపయోగించండి.

7. మీ చర్మాన్ని స్క్రబ్బింగ్ చెయ్యకపోవటం : 

మీ చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయటం వలన, చర్మంపై ఉన్న వ్యర్ధాన్ని మొత్తం తొలగించి పరిశుభ్రంగా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇది ఒక మంచి ఉపాయము. అలా స్క్రబ్బింగ్ చెయ్యకపోవటం వల్ల, మీ చర్మం దాని యొక్క సహజ సౌందర్యాన్ని కోల్పోయి, ఎర్ర బడటం, పగుళ్ళకు గురవటం వంటివి జరుగుతాయి. అందువలన మీ చర్మాన్ని వారంలో ఒక్కసారైనా స్క్రబ్బింగ్ చేయించాలి. అలా మీ చర్మాన్ని శుభ్రపరిచేటట్లుగా నిర్ధారించుకోవడం చాలా అవసరం.

8. కఠినమైన సౌందర్య సాధనాలను ఉపయోగించడం : 

కఠినమైన రసాయనాలతో తయారుచేయబడిన సౌందర్య సాధనాలు మీ ముఖ చర్మం యొక్క ఆరోగ్యాన్ని మరియు రూపాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అటువంటి రసాయనాలను కలిగిన ఉత్పత్తులను వాడటం వల్ల, మీ చర్మంలో సహజంగా దాగున్న తేమను హరించి, డీహైడ్రేట్ వంటి భావనను మీకు కలుగజేస్తుంది. అందువల్ల, రసాయనాలు కంటే ఎక్కువ సహజసిద్ధంగా లభించే పదార్ధాలను కలిగి ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.

9. మీ మెడ భాగాన్ని కూడా మాయిశ్చరైజింగ్ చెయ్యాలి : 

చాలా ఎక్కువ మంది మహిళలు వారి యొక్క మెడ బాగానే అస్సలు పట్టించుకోరు మరియు ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించరు. దానివల్ల వారి మెడ యొక్క చర్మము అకాల వృద్దాప్య సంగతులను తెలియజేసేటట్లుగా నల్లని రంగులో మీ చర్మము దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ ముఖ తేజస్సు కన్నా, మీ మెడ భాగం అనేది చాలా నల్లగా కనపడుతుంది. ఈ ప్రభావం నుండి బయటపడాలంటే మీ ముఖాన్ని మాయిశ్చరైజర్ తో శుభ్రం చేసే ఈ సమయంలోనే - మీ మెడ భాగాన్ని కూడా మాయిశ్చర్ చేస్తూ ఉండటాన్ని అలవాటు చేసుకోండి.




Comments