గ్లిజరిన్ + రోజ్ వాటర్ ని కలిపి వాడితే ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు

గ్లిజరిన్ అనే పేరువింటేనే చాలా మందికి ఉండే సాధారణ అభిప్రాయం ఒకటే. సినిమాలలో, నాటకాలలో సన్నివేశానికి తగినట్టుగా తారలకు కన్నీళ్లను తెప్పించేందుకు వాడే పదార్థం మాత్రమేనని ఎంతో మంది అభిప్రాయపడుతూ వుంటారు . దీని ఉపయోగం ఇంతవరకేనని భావిస్తారు. వెండితెరపై దీనిని వాడి సెంటిమెంట్ ను పండించే తారలే గుర్తొస్తారు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ లో కూడా వీటి వాడకం విపరీతమైందని గుర్తుతెచ్చుకుని గ్లిజరిన్ ని వాడకుండానే వచ్చే ఏడుపుని ఆపుకోలేక నవ్వుకుంటారు.

 అయితే, గ్లిజరిన్ లో మరో కోణం కూడా ఉంది. ఈ అద్భుతమైన ఇంగ్రిడియెంట్ లో సౌందర్యాన్ని సంరక్షించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది చర్మానికి తగిన సంరక్షణను ఇస్తుంది. దీని సరైన విధంగా వాడటం ద్వారా అనేక చర్మ సంరక్షణ ప్రయోజనాలను పొందవచ్చు.
వెజిటబుల్ ఫ్యాట్స్ నుంచి గ్రహించబడిన గ్లిజరిన్ అనేది నీళ్లలో కరిగిపోతుంది. ఇది, చక్కెర మరియు ఆల్కహాల్ మిశ్రమం. దీనికి, రంగులేదు. వాసన ఉండదు. ఇది విషపూరితం కాదు. కాస్తంత తీయదనం కలిగి ఉంటుంది. దీనిలో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీలో దీనిని ముఖ్య ఇంగ్రిడియెంట్ గా వాడతారు. ఫార్మా కంపెనీలతో పాటు కాస్మెటిక్ కంపెనీలకు ఇది అత్యంత ఇష్టమైన ఇంగ్రిడియెంట్. అయితే, వాటికి వాడే గ్లిజరిన్ అనేది పెట్రోలియం నుంచి గ్రహించబడినది. చర్మసంరక్షణకు మాత్రం ఆర్గానిక్ గ్లిజరిన్ ను మాత్రమే వాడాలి.

గ్లిజరిన్ ను రోజ్ వాటర్ తో కలిపి చర్మాన్ని సంరక్షించుకుంటే చర్మంలోని నిగారింపుని మెరుగవుతుంది. ఇప్పుడు, వీటిని ఏ విధంగా వాడాలో పరిశీలిద్దాం.

1. క్లీన్సర్ 

గ్లిజరిన్ అనేది న్యూట్రల్ కాంపౌండ్. ఇది యాసిడిక్ కాదు. అలాగే ఆల్కలైన్ కూడా కాదు. ఈ లక్షణం వలన ఇది చర్మంపై పేరుకోబడిన దుమ్మూ ధూళిని అరికట్టేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో చర్మానికి ఏ మాత్రం హానీ కలగదు. రోజ్ వాటర్ లో లభించే ఫెనైలెతనాల్ అనేది తేలికపాటి అస్ట్రింజెంట్ గా లేదా టోనర్ గా పనిచేస్తుంది. అందువలన, క్లాగ్ చేయబడిన పోర్స్ ను శుభ్రం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ ను రోజ్ వాటర్ తో కలిపి తేలికపాటి బ్లీచింగ్ ఏజెంట్ అయినా నిమ్మరసాన్ని జోడిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. స్కిన్ లైటెనింగ్ కు ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని వాడటం ద్వారా తక్కువ ఖర్చుతోనే స్కిన్ లైటెనింగ్ ఎఫెక్ట్ ను పొందవచ్చు.

ఎలా వాడాలి

 ఒక చిన్నపాటి మాసన్ జార్ లో సమాన పరిమాణాలలో రోజ్ వాటర్ ను అలాగే గ్లిజరిన్ ను తీసుకోవాలి. ఈ రెండూ కరిగేలా బాగా కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఇప్పుడు, మందపాటి నిమ్మ చెక్కలను తీసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. దీనిని ప్రతిరోజూ కాటన్ ని వాడి చర్మంపై అడ్డుకుంటే పేరుకుపోయిన దుమ్మూ ధూళి తొలగిపోతాయి.

2. ఫేస్ ప్యాక్

 గ్లిజరిన్ ని అలాగే రోజ్ వాటర్ ని కలిపి స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా వాడితే మీ చర్మం నిగారింపుని సొంతం చేసుకోవటంతో పాటు సహజసిద్ధమైన కాంతితో వెలిగిపోతుంది. శీతాకాలంలో, ఎక్కువ మంది భారతీయ మహిళలు శనగపిండి ఫేస్ ప్యాక్ ను వాడతారు. శనగపిండిని పాలలో కలిపి సమర్థవంతమైన మాయిశ్చరైజింగ్ ప్యాక్ ను తయారుచేసుకుంటారు. గ్లిజరిన్ ను అలాగే రోజ్ వాటర్ ను ఈ మాయిశ్చరైజింగ్ ప్యాక్ లో కలిపితే శీతాకాల చర్మ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్లను ఫేస్ ప్యాక్ లా మరొక విధంగా కూడా వాడుకోవచ్చు. ముల్తానీ మట్టిలో లేదా బెంటోనైట్ క్లేలో ఈ రెండిటినీ కలిపి ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకుని చర్మంపై అప్లై చేసుకోవాలి.

 ఎలా వాడాలి 

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ మిశ్రమంలో కలపాలి. దట్టమైన పేస్ట్ ని తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేసి దాదాపు ఇరవై నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు, గోరువెచ్చటి నీటితో బాగా కడగాలి. ఆ తరువాత, ముఖాన్ని సున్నితంగా తుడుచుకుని ఆరనివ్వాలి.

మాయిశ్చరైజర్ 

గ్లిజరిన్ అనేది ఆయిలీ గా అనిపిస్తుంది. అందువలన, చర్మంలోని తేమని నిలిపి ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రత్యేకించి శీతాకాలంలో ఇది విపరీతంగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ తో కలిపి దీనిని వాడితే స్కిన్ ని టోన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే, చర్మరంధ్రాలను లోపల నుంచి శుభ్రపరుస్తుంది. మొటిమల సమస్యను నివారిస్తుంది.

 ఎలా వాడాలి

 ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ సొల్యూషన్ లో అర టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి పట్టించి మరుసటి రోజు గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

టోనర్

గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ అనేవి న్యూట్రల్ పదార్థాలు. అందువలన, ఇవి చర్మంలోని పిహెచ్ స్థాయిలను పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి. అలాగే, క్లాగ్ చేయబడిన పోర్స్ ను శుభ్రపరిచి మొటిమల సమస్యను అరికడతాయి.

ఎలా వాడాలి

ఒక స్ప్రే బాటిల్ లో గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ లను సమాన పరిమాణాలుగా తీసుకోండి. రోజు చివరిలో మీరు మేకప్ ని తొలగించిన తరువాత ఈ సొల్యూషన్ ను ముఖంపై స్ప్రే చేసుకోండి. ఈ స్ప్రే ద్వారా చర్మానికి అందిన సొల్యూషన్ ను సహజంగా ఆరనివ్వండి.

గుర్తుంచుకోవలసిన చిట్కాలు

1. గ్లిజరిన్ అనేది జిడ్డుగా ఉండటం వలన కాంబినేషన్ స్కిన్ అలాగే ఆయిలీ స్కిన్ కలిగిన వారు గ్లిజరిన్ ని వారంలో ఎక్కువసార్లు వాడకూడదు.

2. రోజ్ వాటర్ లో డైల్యూట్ చేయబడిన గ్లిజరిన్ ని వాడటం ఉత్తమం. ఈ మిశ్రమం తేలికపాటి అస్ట్రింజెంట్ గా పనిచేసి క్లాగ్ చేయబడిన పోర్స్ ను శుభ్రం చేస్తుంది.

3.సహజంగా సేకరించబడిన గ్లిజరిన్ ను మాత్రమే చర్మ సంరక్షణకు వాడాలి. పెట్రోలియం నుంచి తీసుకోబడిన గ్లిజరిన్ ను సౌందర్య పోషణకు వాడకూడదు.

Comments