డార్క్ నెక్ (మెడ నలుపు)నివారించే బెస్ట్ హోం రెమెడీస్

చాలా మంది మహిళలను వేదించే సమస్య డార్క్ నెక్(మెడ నల్లగా మారడం). మెడ నల్లగా ఉండటం వల్ల మీ పర్సనాలిటీని తక్కువ చేస్తుంది.

 చాలా మంది మహిళలు ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖం అందం మీద కూడా పడుతుందని బ్యూటీగీషియన్లు అంటున్నారు. ముఖంతో పాటు మెడ అందం కూడా ముఖ్యమేనని వారు చెబుతున్నారు. ముఖంతో సమానంగా మెడ అందంగా ఉంచుకోవడాని కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటితో మీ మెడ సౌందర్యంను పెంపొందించుకోవచ్చు. ...

నిమ్మరసం:

 నిమ్మరసం ట్యానింగ్ (మెడనలుపు)ను తగ్గిస్తుంది మరయు చర్మం అందంగా తెల్లగా కనబడేలా చేస్తుంది. నిమ్మతొక్కను తీసుకొని నేరుగా మెడ మీద రుద్దాలి. మరింత త్వరగా ఫలితం పొందాలంటే నిమ్మ తొక్క మీద కొద్దిగా రోజ్ వాటర్ వేసి రుద్ద అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

 కొబ్బరి నూనె మీ చర్మానికి పోషణ అందిస్తుంది, మరియు టానింగ్(నలుపును మరియు ప్యాచెస్ ను)నివారిస్తుంది. అందువల్ల మెడ మీద టానింగ్ నివారించడానికి కొబ్బరి నూనెను మర్దన చేస్తుండాలి.

బేకింగ్ సోడా : 

కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మీ మెడ మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది డార్క్ నెక్ నివారించడానికి ఇది ఒక గొప్ప మార్గం.

ఓట్స్ టమోటో: 

3 టేబుల్ స్పూన్ల ఓట్స్ ను మెత్తగా పొడి చేసి అందులో కొద్దిగా టమోటో గుజ్జు వేసి మెడచుట్టూ అప్లై చేసి తర్వాత 15నిముషాల తర్వాత మర్దన చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ:

 కీరదోసకాయ నేచురల్ వైట్ స్కిన్ అందివ్వడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కీరదోసకాయ జ్యూస్ ను మెడ చుట్టూ అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజ్ వాటర్:

 రోజ్ వాటర్ తో మెడను శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుంది . రోజ్ వాటర్ కు కొద్దిగా పసుపు మిక్స్ చేసి మెడ చుట్టూ అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తేనె:

 డార్క్ నెక్ నివారించడానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనెను నేరుగా మెడకు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా జెల్: 

మెడ నలుపును తగ్గించడంలో అలోవెరా జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి, అలోవెరా జెల్ ను నేరుగా మెడకు పట్టించి పదిహేను నిముషాల తర్వతా శుభ్రం చేసుకోవాలి.

వాల్ నట్ :

మీ మెడను ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడానికి వాల్ నట్ పౌడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. పెరుగులో వాల్ నట్ పౌడర్ మిక్స్ చేసి తర్వాత మెడకు అప్లై చేయడం ద్వారా మంచి కాంతిని పుంజుకుంటుంది. వాష్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే తెలుస్తుంది.

లెమన్ -షుగర్ :

 మెడ మీద నలుపును నివారించుకోవడం కోసం నిమ్మరసానికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి,దీన్ని మెడచుట్టు అప్లై చేసి 15నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం నూనె మరియు విటమిన్ ఇ: 

ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెకు విటమిన్ ఇ క్యాప్యూస్ మిక్స్ చేసి దీన్ని మీ డార్క్ నెక్ చుట్టూ అప్లై చేయాలి. ఒక వారంలో ఫలితాన్ని గమనించండి.

రైస్ వాటర్:

 అన్నం వంచి గంజిని పారబోయకుండా దీన్ని మెడ మీద అప్లై చేసి తర్వాత శుభ్రం చేయాలి.

పొటాటో జ్యూస్:

 మెడ మీద నలుపును నివారించడం కోసం బంగాలదుంప రసంను అప్లై చేయాలి. మరింత మంచి ఫలితాలకోసం నిమ్మరసం మిక్స్ చేయాలి.

ఆరెంజ్ : 

కాంతి వంతమైన చర్మసౌందర్యం ను పొందడానికి ఆరెంజ్ గ్రేట్ గా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ తొనలతో మెడ చుట్టు మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి: 

శెనగపిండిని పెరుగుతో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మెడకు పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్: 

ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ లో 2టేబుల్ స్పూన్ల వాటర్ మిక్స్ చేసి, ఈ వాటర్ తో మెడను కడిగి శుభ్రం చేసుకోవాలి,.

ఆలివ్ ఆయిల్: 

ఆలివ్ ఆయిల్ మంచి ఫోషణ అందించే మరియు ట్యాన్ తొలగించే బ్యూటీ ప్రొడక్ట్.


Comments