నిద్రకు ముందు ఇలా చేస్తే.. మెరిసే చర్మంతో మేల్కొంటారు..!

డార్క్ సర్కిల్స్, జిడ్డు చర్మం, ముఖంపై మచ్చలతో నిద్రలేస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. కొన్ని సార్లు అందమైన, గ్లోయింగ్ స్కిన్ ప్రసాదించమని దేవుడిని కూడా ప్రార్థిస్తుంటారు. కానీ.. కాస్త ఓపికతో.. మీ చర్మంపై శ్రద్ద తీసుకుంటే.. మీరు కోరుకున్న డ్రీమ్ స్కిన్ పొందడం పెద్ద కష్టమేమీ కాదు.
మీరు సంతోషంగా ఉన్నారా, ఒత్తిడితో ఉన్నారా, భయపడుతున్నారా అనేది మీ చర్మమే చెప్పేస్తుంది. కాబట్టి.. మీ చర్మం గ్లోయింగ్ గా ఉండాలంటే.. కంటినిండా నిద్రపోవాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలి. దాంతో పాటు.. కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.

మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవాలంటే.. కొన్ని స్కిన్ కేర్ టిప్స్ ని కూడా మీ అలవాట్లలో భాగం చేసుకోవాలి. రాత్రినిద్రపోవడానికి ముందు ఈ ఫేస్ ప్యాక్స్ అప్లై చేస్తే.. ఉదయానికళ్లా గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. అయితే రాత్రికి రాత్రే పర్ఫెక్ట్ స్కిన్ పొందడం తేలిక కాదు. కాబట్టి.. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితేనే.. మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు.

ఆల్మండ్ ఆయిల్ 

1టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్, 2 టీస్పూన్ల కోకో బట్టర్ మిక్స్ చేసి.. హీట్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ రోజ్ వాటర్, 1టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమంతో.. ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు మసాజ్ చేసుకోవాలి.

అలోవెరా జెల్ 

2టీస్పూన్ల అలోవెరా జెల్, 2 టీస్పూన్ల లావెండర్ ఆయిల్ కలపాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి.. నిద్రపోవడానికి ముందు ముఖానికి అప్లై చేయాలి. ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాపిల్స్

 2 యాపిల్స్ తీసుకుని ముందుగా పేస్ట్ చేయాలి. అందులో 2టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాత్రి పడుకోవడానికి ముందు అప్లై చేయాలి. ఉదయం శుభ్రం చేసుకుంటే.. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

పాల మీగడ

1టీస్పూన్ పాల మీగడ, 1 టీస్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి ముఖానికి అప్లై చేస్తే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.

ఆలివ్ ఆయిల్ 

అరకప్పు ఆలివ్ ఆయిల్, 2టీస్పూన్ల కొబ్బరినూనె, 1టీస్పూన్ తేనె కలిపి కాస్త వేడి చేయాలి. చల్లారిన తర్వాత ముఖానికి రెగ్యులర్ గా అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే.. మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

కొబ్బరినూనె 

2టీస్పూన్ల కోకో బట్టర్, 1టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 1టీస్పూన్ కొబ్బరినూనె కలిపి కాస్త వేడి చేయాలి. చల్లారిన తర్వాత.. ముఖానికి పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.


ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె 

1టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్, 1టీస్పూన్ కొబ్బరినూనె కలిపి.. రెండింటినీ కాస్త వేడి చేయాలి. చల్లారిన తర్వాత గ్లిజరిన్, రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపడుకోవడానికి ముందు ముఖానికి అప్లై చేయాలి. ఈ చిట్కాలలో మీకు నచ్చినది రెగ్యులర్ గా ఫాలో అయితే.. మీ చర్మం మీరు కోరుకున్న విధంగా గ్లోయింగ్ గా మారుతుంది.

Comments