మీ ముక్కుమీద ఉన్న బ్లాక్ హెడ్స్ పోగొట్టుకోవడానికి బేకింగ్ సోడాని ఎలా ఉపయోగించుకోవాలి

మీ ముక్కుమ్మెడ కనిపించే చిన్నచిన్న నల్ల గడ్డలు మీ సౌందర్యానికి మచ్చలాంటివి. అన్నిరకాల చర్మలకి సాధారణమైన ఈ బ్లాక్ హెడ్స్ ని భరించడం అనేది చాలా నొప్పితో కూడుకున్నది.

మీ చర్మ రంధ్రలకు ఇవి తరచుగా అడ్డుపడడం వల్ల, బ్లాక్ హెడ్స్ మీ చర్మ ఛాయను అసమానంగా చేస్తాయి.

బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవడానికి సౌందర్య దుకాణాలలో టన్నుల కొద్దీ నోస్ స్త్రిప్పులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో నిజంగా పనిచేసేవి కొన్ని మాత్రమే.
మీరు మీ ముక్కుమీద ఉన్న వికారమైన గడ్డలని తొలగించుకునే మార్గాల కోసం చూస్తుంటే, మేము మిమ్మల్ని కవర్ చేస్తాము. బోల్డ్ స్కై ప్రకారం, చర్మ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాల గురించి, వాటిని ఉపయోగించే వివిధ మార్గాల గురించి మీరు తెలుసుకోండి.

 వీటి పరిష్కారానికి బేకింగ్ సోడా గురించి మనం మాట్లాడుకుందాము. సోడియం బైకార్బోనేట్ అధికంగా కలిగిన బేకింగ్ సోడా ముక్కుమీద ఉన్న బ్లాక్ హెడ్స్ ని తొలగించి, తిరిగి రాకుండా ఉండేట్టు అద్భుతంగా పనిచేస్తుంది.

ముక్కుమీద ఉన్న బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవడానికి బేకింగ్ సోడాని ఉపయోగించడం అనేది వివిధ తేలికైన, ప్రభావవంతమైన మార్గం.

1.బేకింగ్ సోడా పేస్ట్

 1టీస్పూన్ డిస్టిల్డ్ నీటితో కేవలం ½ టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. అద్భుతమైన ఫలితాలను అందించే ఈ పేస్ట్ ని మీ ముక్కు మీద రాయండి. చల్లనీళ్ళతో కదిగేముందు 10-15 పాటు ఆరనివ్వండి. మీ ముక్కుమీద ఉన్న చర్మం శుభ్రంగా, సున్నితంగా మారడానికి కనీసం వారానికి 3-4 సార్లు ఈ ప్రత్యేకమైన బేకింగ్ సోడా ను ప్రయత్నించండి.

2.నిమ్మరసంతో బేకింగ్ సోడా 

½ టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ నిమ్మరసం తో కూడిన మిశ్రమాన్ని తయారుచేయండి. ప్రభావిత ప్రాంతంపై దీన్ని సున్నితంగా రాసి, 15 నిమిషాల పాటు వదిలేయండి. ఒకసారి చేసాక, మీ చర్మాన్ని చల్లని నీటితో కడిగేయండి. ప్రత్యేకంగా జిడ్డు చర్మం కలవారు, ముక్కుపై ఉన్న బ్లాక్ హెడ్స్ ని వదిలించుకోవడానికి ఈ మిశ్రమాన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించ వచ్చు.

3.తేనెతో బేకింగ్ సోడా 

1టేబుల్ స్పూన్ తేనెతో 1 టీస్పూన్ బేకింగ్ సోడా ను కలపండి. ఒకసారి కలిపి, ప్రభావిత ప్రదేశంపై దీన్ని అప్లై చేయండి. 10 నిమిషాల సేపు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయండి. మీ ముక్కుమీద ఉన్న బ్లాక్ హెడ్స్ పోగొట్టుకోవడానికి వారానికి రెండుసార్లు ఈ ఇంట్లో తయారుచేసిన మిశ్రమాన్ని వాడండి.

4.ఓట్మీల్, కొబ్బరినూనె తో బేకింగ్ సోడా

 ½ టీస్పూన్ బేకింగ్ సోడా, 1టీస్పూన్ ఓట్మీల్, 1టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను కలపండి. సమస్య ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. 10 నిమిషాల పాటు ఆరనిచ్చి తడిబట్టతో తుడవండి. ఈ ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ ని వారానికి ఒకసారి వాడి మంచి ఫలితాలు పొందండి.

5.పాలతో బేకింగ్ సోడా 

2 టీస్పూన్ల పాలతో ½ టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై రాసి, 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి, తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి ఒకసారి, మీ ముక్కుపై ఉన్న చర్మంపై ఈ మిశ్రమాన్ని రాసి బ్లాక్ హెడ్స్ ని తరిమి కొట్ట౦డి.

6.సీ సాల్ట్, ఆలివ్ ఆయిల్ తో బేకింగ్ సోడా 

చిటికెడు సీ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో ½ టీస్పూన్ బేకింగ్ సోడాను కలపండి. ఈ మిశ్రమాన్ని ముక్కు మొత్తానికి పట్టించండి. పూర్తిగే ఆరివరకు వదిలేయండి. తరువాత, ఈ మిశ్రమాన్ని చిన్నగా రుద్దుతో చల్ల నీళ్ళతో చర్మాన్ని కడగండి. ఈ తేలికగా తయారుచేసుకునే స్క్రబ్ ను వారం మార్చి వారం ఉపయోగించి మీ ముక్కుపై ఉన్న బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోండి.

7.రోజ్ వాటర్, బ్రౌన్ షుగర్ తో బేకింగ్ సోడా 

ఒక గాజు బౌల్ తీసుకుని, అందులో ½ టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలపండి. తరువాత అందులో 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ని కలపండి. వీటన్నిటినీ బాగా కలపండి. సమస్య ఉన్న ప్రదేశం మొత్తం ఈ మిశ్రమంతో మర్దనా చేయండి. ఒకసారి చేసాక, చల్లని నీటితో కడిగేయండి. మిశ్రమ రకం చర్మానికి ఇది సరిపోతుంది, మీ ముక్కుమీద ఉన్న బ్లాక్ హెడ్స్ ని తొలగించడానికి ఈ స్క్రబ్ ని వారానికి ఒకసారి ఉపయోగించండి.

8.యాపిల్ సైడర్ వెనిగర్ తో బేకింగ్ సోడా

 4-5 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ నీటితో చిటికెడు బేకింగ్ సోడా కలపండి. సమస్య ఉన్న ప్రాంతంపై ఈ ఫలితాన్నిచ్చే పేస్ట్ తో సున్నితంగా మర్దనా చేసి, 10 నిముషాలు ఉంచండి. తరువాత, చల్లనీల్లు వాడి పూతను పోగొట్టండి. వారం మార్చి వారం ఈ ఇంట్లో తయారుచేసిన పేస్ట్ ని ఉపయోగించి మీ చర్మ ఉపరితలం నుండి వ్యర్ధాలను తొలగించి, అందంగా కనపడే ముక్కును పొందండి.


Comments