అందమైన ముఖం మీద ఒక చిన్న మొటిమ పొడుచుకొని వచ్చి కనిబడుతుంటే, అది చూడటానికి అసహ్యాంగా ఉండటమే కాదు, ఆ బాధ , నొప్పి కూడా చెప్పలేనంత విధంగా ఉంటుంది. మొటిమలు ముఖ అందాన్ని పాడు చేయడం మాత్రమే కాదు , ముఖ సౌందర్యాన్ని అసౌకర్యంగా మరియు అందవిహీనంగా మార్చేతుంది. మొటిమలు నివారించడానికి చాలా సింపుల్ చిట్కాలున్నాయి . మొటిమలు మరియు మచ్చలు మరియు వాటి ద్వారా వచ్చే నొప్పిన తగ్గించుకోవడానికి మీరే ఇంట్లో సులభ చిట్కాలను అనుసరించవచ్చు. మొటిమలను నివారించడం కోసం చాలా సాధరణంగా మరియు ప్రతి రోజూ తీసుకొనే చర్మ సంరక్షణ చిట్కాలను అందివ్వడం జరిగింది.
ఇవి ఖరీదైనవి కాదు, అలాగే మనకు దొరకని కాదు, మనుకు చాలా సులభంగా అందుబాటులో ఉంటే చిట్కాలే. మనం చాలా సులభంగా అనుసరించదగ్గ చిట్కాలే. ఈ చిట్కాలను తప్పనిసరిగా రెగ్యులర్ గా ఉపయోగించాలి . నిజానికి మొటిమలను నివారించడానికి ఇవి చాలా కామన్ స్కిన్ కేట్ టిప్స్ . చర్మం క్లియర్ గా మరియు క్లీన్ గా మరియు హెల్తీగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు చాలా కామన్ టిప్స్. మరి మొటిమలను నివారించే సింపుల్ అండ్ కామన్ స్కిన్ కేర్ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం....
ముందు ముఖంను శుభ్రంగా ఉంచుకోవాలి తరచూ ముఖంను శుభ్రంగా మరియు క్లీన్ గా ఉంచుకోవాలి. తరచూ బయట తిరిగే వాళ్ళు చర్మ రంద్రాలలో దుమ్ముధూలి చేరి మొటిమలకు కారణం అవుతుంది . మీ ముఖంను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోకపోతే, చర్మం రంద్రాలు మూసుకుపోతాయి . అక్కడ వైట్ హెడ్ మరియు బ్లాక్ హెడ్స్ ఏర్పడి అసహ్యంగా కనబడుతుంటాయి.
ఇవి ఖరీదైనవి కాదు, అలాగే మనకు దొరకని కాదు, మనుకు చాలా సులభంగా అందుబాటులో ఉంటే చిట్కాలే. మనం చాలా సులభంగా అనుసరించదగ్గ చిట్కాలే. ఈ చిట్కాలను తప్పనిసరిగా రెగ్యులర్ గా ఉపయోగించాలి . నిజానికి మొటిమలను నివారించడానికి ఇవి చాలా కామన్ స్కిన్ కేట్ టిప్స్ . చర్మం క్లియర్ గా మరియు క్లీన్ గా మరియు హెల్తీగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు చాలా కామన్ టిప్స్. మరి మొటిమలను నివారించే సింపుల్ అండ్ కామన్ స్కిన్ కేర్ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం....
ముందు ముఖంను శుభ్రంగా ఉంచుకోవాలి తరచూ ముఖంను శుభ్రంగా మరియు క్లీన్ గా ఉంచుకోవాలి. తరచూ బయట తిరిగే వాళ్ళు చర్మ రంద్రాలలో దుమ్ముధూలి చేరి మొటిమలకు కారణం అవుతుంది . మీ ముఖంను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోకపోతే, చర్మం రంద్రాలు మూసుకుపోతాయి . అక్కడ వైట్ హెడ్ మరియు బ్లాక్ హెడ్స్ ఏర్పడి అసహ్యంగా కనబడుతుంటాయి.
మాయిశ్చరైజింగ్
చర్మం సంరక్షణలో మాయిశ్చరైజింగ్ చాలా ముఖ్యమైనది. చర్మానికి రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేయడం వల్ల చర్మం పాప్ట్ గా మరియు షైనీగా ఉంటుంది. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి ఇరిటేషన్ కు తావివ్వదు. మరియు చిన్న చిన్న చర్మ సమస్యలను ఎదుర్కోకుండా చర్మానికి రక్షణ కల్పిస్తుంది.మొటిమలను స్క్రాచ్ చేయకూడదు:
ముఖంలో మొటమలు చాలా సమస్యాత్మకంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే చేతులతో మరియు గోళ్ళతో మొటిమలను టచ్ చేస్తే మరియు వాటిని గోకాలనిపిస్తుంది. ఇలా గోళ్ళు మొటిమలకు తగలడం వల్ల మొటిమలు మరింత ఎక్కువ అవుతాయి . మొటిమలను స్క్రాచ్ చేయడం వల్ల మొటిమలు నయం అవ్వడం ఆలస్యం అవుతుంది. మరియు మొటిమల తాలుకు మచ్చలు ముఖం మీద ఏర్పడి మరింత అస్యహ్యంగా ఏర్పడుతాయి. ముఖం శుభ్రం చేసుకోవడంలో ఇది ఒక క్లీన్ టిప్ .మేకప్ ను నివారించాలి:
పరిమితికి మించి మేకప్ వేసుకోవడం లేదా రెగ్యులర్ గా మేకప్ లో ఉండటం వల్ల కూడా మొటిమలకు ప్రధాణ కారణం అవుతుంది . కాబట్టి, మేకప్ ను మితంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. మేకప్ వల్ల కూడా మీ ముఖంలో మొటిమలు ఏర్పడుతుంటే, మీ చర్మం చాలా సున్నితమైనదని గ్రహించాలి . మేకప్ కూడా చర్మం యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది . దాంతో మరిన్ని చర్మ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.సూర్య రశ్మి నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది:
సూర్య రశ్మి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు . అయితే పరిమితి మించితే మాత్రం చర్మ సమస్యలు ఎదుర్కోక తప్పదు . మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు, సూర్య రశ్మి మరో సమస్యను తెచ్చిపెడుతుండి . కాబట్టి, మంచి సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి . నీడలో ఎక్కువగా ఉండాలి. సన్ గ్లాస్ ఉపయోగించాలి. ఎక్కువగా ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లో కవర్స్ ను తరచూ శుభ్రం చేస్తుండాలి:
పిల్లో కవర్స్ ను రెగ్యులర్ గా మార్చకపోతే, మరో చర్మ సమస్య ఎదుర్కోవల్సి ఉంటుంది. పిల్లో కవర్స్ లో చాలా త్వరగా జర్మ్స్ చేరుతాయి . కాబట్టి, పిల్లో కవర్స్ ను కనీసం వారానికొకసారి మార్చుతుండాలి . మీ ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి.ఒత్తిడి తగ్గించుకోవాలి
అధిక ఒత్తిడి వల్ల ఇతర వ్యాధుల వలె, మొటిమలకు కూడా కారణం అవుతుంది. మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు మరియు స్ట్రెస్ ఫుల్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు మొటిమలు క్రమంగా పెరుగుతాయి. మానసిక ప్రభావం మొటిమల మీద ఎక్కువగా ఉంటుందిహెల్తీ ఫుడ్ తీసుకోవాలి
ప్రతి దినం మనం తీసుకొనే ఆహారం చాలా ఆరోగ్యకరమైనదై ఉండాలి. ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధులను దూరం చేయడం మాత్రమే కాదు మీ చర్మం మెరిసేందుకు సహాయపడుతుంది . బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల మీ శరీరంకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను మరియు చర్మ సంరక్షణకు అవసరం అయ్యే పోషకాలను అందిస్తుంది.ముఖంలో అవాంఛిత రోమాలు లేకుండా జాగ్రత్తపడాలి
మొటిమలు చికిత్సలో చర్మ సంరక్షణ చిట్కాలలో ఒకటి ముఖం మీద అవాంఛిత రోమాలు లేకుండా చూసుకోవాలి . జుట్టు ఉండటం సమస్య కాకపోయినా చర్మంమీద ఉండే జుట్టు ఆయిలీగా మారడం వల్ల స్కిన్ ఇరిటేషన్ మరియు మొటిమలకు కారణం అవుతుంది. మరియు మీ జుట్టును కూడా తరచూ శుబ్రంగా ఉంచుకోవాలి. జుట్టు ముఖం మీద పడుతున్నప్పుడు, జుట్టులోని మురికి, డస్ట్ ముఖం మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ముఖంను ఎక్కువసార్లు కడగకూడదు
ముఖం శుభ్రం చేసుకోవడం మంచిదే అయితే ఓవర్ వాష్ చేయడం చర్మానికి హాని. ఎందుకంటే ఎక్కువగా కడగడం వల్ల చర్మంలోని ఎన్సెన్షియల్ ఆయిల్స్ ను నివారిస్తుంది మరియు సెన్సివిటిని దెబ్బతీస్తుంది . దాంతో మొటిమలకు కారణం అవుతుంది.
హనీ మాస్క్
తేనెలో యాంటీబ్యాక్టీరియల్, డిస్ ఇన్ఫెక్ట్ మరియు హీలింగ్ ప్రొపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి . ఇవి చర్మానికి అద్భుతాలను చేస్తాయి. కాబట్టి తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖం క్లియర్ గా మరియు హెల్తీగా లుకింగ్ గుడ్ గా కనిపిస్తుంది . ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
షాంపు
మీరు ఉపయోగించే షాంపును చెక్ చేయాలి. షాంపు కారణంగా కూడా మొటిమలకు కారణం అవుతుంది. షాంపులోని కొన్ని పదార్థాలు మీ చర్మానికి నప్పకపోవచ్చు , దాంతో ముఖంలో మొటిమలకు దారితీయవచ్చు . కాబట్టి మొటిమలున్నప్పుడు, బ్రాండ్ మార్చుకోవడం లేదా నేచురల్ పదార్థాలను ఉపయోగించడం చేయాలి.
రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి
రెగ్యులర్ వ్యాయామం వల్ల చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేస్తాయి. ముఖ్యంగా చెమట ద్వారా చర్మంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తాయి. చర్మంలోని మలినాలను ఎప్పుడైతే తొలగించుకుంటారో, అప్పుడు మొటిమలను నివారించుకోవచ్చు. క్లియర్ స్కిన్ పొందవచ్చు.
Comments
Post a Comment