అందానికీ ఆరోగ్యానికీ అరటి మంచి నేస్తం. పెరట్లో పండే, అందుబాటు ధరలో దొరికే అరటితో ఎన్నిరకాల లాభాలున్నాయో చూడండి. అరటిపండును తినడం ద్వారా అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అంతేకాదు దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్ బి6, కాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి. అరటి పండును తినడమే కాదు ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని పోషక విలువలున్న ఇలాంటి పండుతో న్యూట్రిషినల్ ఫేషియల్ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది. మరి ఆ ఫేస్ మాస్కులు ఏంటో చూద్దాం...
అరటి పండు:
బాగా పండిన అరటి పండును మెత్తగా చిదిమి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బనానా ఫేస్ ప్యాక్ ముగిసిన తర్వాత ముఖానికి ఐస్ క్యూబ్స్ ను మర్ధన చేసుకోవచ్చు. బనానా గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం సున్నితంగా, మెరుస్తుంటుంది. ఇలా చేయడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది.
బనానా(అరటి)-తేనె:
మనందరికి తెలుసు అరటిపండులోనూ, తేనెలోనూ అద్భుతమైన న్యూట్రియంట్స్ కలిగి ఉన్నాయని. అరటి పండులోని సగభాగం తీసుకొని ఒక బౌల్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పొడిబారినట్లు కనబడుతుంటే కనుక ఫేషియల్ స్టీమింగ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకొని చూడండి అద్భుతమైన మార్పు కనబడుతుంది.
బనానా(అరటి)-ఓట్స్:
మీరు బాగపండిన అరటి పండుకు ఓట్స్ ను చేర్చి ఫేస్ మాస్క్ అప్లై చేయండి. ఇది ఒక సులభమైన చిట్కా. అరకప్పు ఓట్స్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని అందులో అరటిపండు గుజ్జును కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ నేచురల్ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత ముఖం మీద నీళ్ళు చల్లుకొని సున్నితంగా రుద్దాలి. తర్వాత జోరుగా నీళ్ళు పోస్తు ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఉన్నా బ్లాక్ హెడ్స్, మృత కణాలు తొలగిపోతాయి.
బనానా(అరటి)-నేచురల్(సాధారణ)నూనెలు:
అరటి పండు, నేచురల్ ఆయిల్స్ (బాదాం నూనె, ఆలివ్ నూనె) వంటివి ఫర్ ఫెక్ట్ నేచురల్ స్కిన్ కేర్ కాంబినేషన్స్. ఒక బౌల్లో అరటి పండు గుజ్జు, తర్వాత ఒక చెంచా మీకు నచ్చిన ఏదేని నేచురల్ ఆయిల్ తీసిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ముఖం స్మూత్ గా తయారవుతుంది.
అరటిపండు-పాలు:
రెండు చెంచాల అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ ముఖం కాంతివంతంగాను, తాజాగాను కనబడుతుంది.
Comments
Post a Comment