ఆలివ్ ఆయిల్ తో చర్మంలో కాంతి, నునుపుదనం..!

ఆలివ్‌ రుచినీ, సువాస ననీ, విటమిన్స్‌నీ, సహజ లక్షణా లనీ, గుణాలనీ పదిలపరచు కున్న సహజమైన ఫలరసం ఆలి వ్‌ ఆయిల్‌. ఆలివ్‌ పండులోంచి పిండగానే వెనువెంటనే ఎంతో స్వాదిష్టంగా సేవించగలిగిన ఆయిల్‌ ఇది ఒక్కటే. ఆలివ్‌ ఆయిల్‌ని ఎప్పుడూ సూర్యరశ్మి సోకే చోట వుంచకూడదు. సీసా మూత గట్టిగా మూసి, చల్లగా పొడిగా వుండే ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. ఏ ఉష్ణోగ్రతలలోనైనా ఆలివ్‌ ఆయిల్‌కి కొద్దిగా గాలి సోకినా అందులో రాన్‌సిడిటీ పెరిగిపోతుంది. కనుక మన గుండె బలానికీ, క్యాన్సర్‌ నివారణకీ ఎంతగానో దోహదం చేసే ఆలివ్‌ ఆయిల్‌ని ఎంతో భద్రంగా పదిల పరచి వాడుకుంటే, నిస్సందేహంగా ఆలివ్‌ ఆయిల్‌ మనపాలిట సంజీవనిగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఆలివ్ ఆయిల్ చర్మ సంరక్షణలోనూ, జుట్టు సంరక్షణలోనూ ఎంతో ఉపయోగపడుతుంది.

 1. పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.

 2. ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.

3. ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.

4. ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ ధృడత్వం, అందం పెరుగుతాయి.

5. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.

Comments