టీ త్రాగనివారంటూ ఉండరంటే అశ్చర్యమే. ఎందుకంటే అన్ని దేశాలలో ఇది అలవాటుగా మారింది. టీ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని రెంటింపు చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. టీలో ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది చర్మాన్నిఎల్లప్పుడు తేమగా ఉండేలా చేస్తుంది. ‘టీ'తో సౌందర్యానికి సంబంధించే ఎక్కువ బెనిఫిడ్సే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు.
టీ' చర్మ సంరక్షణలో స్కిన్ టోన్ గాను, అద్భుతమైన సన్ స్క్రీన్ గాను పనిచేస్తుంది. ‘టీ' తో తయారు చేసుకొనొ ఫేస్ మాస్క్ లతో కళ్ళు క్రింద ఏర్పడ్డ నల్లని వలయాలను పోగొట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి టీ' ని ఒక పానీయంగా మాత్రమే ఎందుకు తాగాలి? సౌందర్య సాధనంగా ఉపయోగించి వాటి అద్భుతాలేంటో తెలుసుకుందాం. అందమైన ముఖ సౌందర్యానికి ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి టీ ఫేస్ మాస్క్ మీ కోసం...
టీ మరియు అరటిపండుతో మాస్క్:
రెండు చెంచాల టీ డికాషన్ కు బాగా పండిన ఒక అరటిపండును చేర్చి బాగా చిదిమి మెత్తని పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత దీన్ని అరగంట సేపు ఇలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడానికి మాత్రమే కాదు చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉండేందుకు సహాయపడుతుంది.టీ, ఓట్స్ మరియు తేనె మాస్క్:
ముందుగా అరకప్పు ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో తీసుకొని అందులో ఓట్స్ పౌడర్, రెండు చెంచాలా టీ డికాషన్, ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత స్క్రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ ముఖ చర్మంలో నునుదనం మరియు మెరుపు సంతరించుకుంటుంది.
టీ, బియ్యం పిండి మరియు నిమ్మరసం:
ఇది మరొక టీ ఫేష్ మాస్క్. మూడు చెంచాల బియ్యం పిండి, రెండు చెంచాల టీ మరియు మూడు చుక్కల నిమ్మరసం వేసి బాగా బ్లెండ్ చేసి ముఖ చర్మ మీద బాగా మసాజ్ చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళును శుభ్ర పరిచి డార్క్ సర్కిల్స్ ను పోగొడుతుంది. పొడి చర్మం కలవారు కూడా ఈ ఫేస్ మాస్కను ఉపయోగించవచ్చు.
టీ మరియు చాక్లెట్ మాస్క్:
టీ మరియు చాక్లెట్ లలో యాంటియాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నాలుగు చెంచాల కోకో పౌడర్ మరియు మూడు చెంచాల టీ డికాషన్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంలో నల్లమచ్చలు, మొటిమలు తొలగించి, మృతకణాలను అతి సులభంగా వదలగొడుతుంది.
Comments
Post a Comment