మీ చర్మ సౌందర్యాన్ని...అందాన్ని ద్విగుణీకృతం చేసే విటమిన్స్

చర్మ సంరక్షణలో చర్మం ఆరోగ్యంగా ఉండటకు మెరిసే చర్మం కోసం రకరకాల సౌందర్య సాధనాలే కాదు. మనం ప్రతినిత్యం తీసుకునే ఆహారం కూడా ఎంతో కీలకం. అలాంటి పదార్ధాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే ఆరోగ్యకరమైన చర్మసౌందర్యం కలిగి ఉంటారు. వయస్సురిత్యా చర్మంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ చర్మం ముడతలు పడటం, చర్మం సాగినట్లు కనబడుతుంది. అందుకు కారణం ముఖచర్మంలో ఉండే కండరాలు పటుత్వం తగ్గడమే. వీటన్నింటినీ నివారించాలంటే మంచి పౌష్టికాహారంతో పాటు రోజు వారీ చర్మం సంరక్షణపై దృష్టి పెట్టాలి. వాటితోపాటు ప్రతి రోజూ చర్మాన్ని శుభ్రపరచుకోవడం.. మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వంటి ప్రాథమిక చర్యలతో పాటు వారానికోసారి ఫేషియల్స్ చేసుకోవాలి.

ఎ విటమిన్‌:

 తృణ ధాన్యాలు, క్యారెట్లు, చిలగడదుంప, పాలకూర, వెన్నతీయని పాలు, కాలేయం, చేపనూనెలు, కోడిగుడ్లు, అన్నిరకాల ముదురురంగు పండ్లు, కూరగాయల నుంచి ఈ పోషకాన్ని పొందవచ్చు.

 సి విటమిన్‌:

 తృణధాన్యాలు, పండ్ల రసాల నుంచి సి విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. కాబట్టి అల్పాహార సమయంలో తీసుకుంటే మంచిది. లేదంటే నిమ్మజాతి పండ్లు తీసుకుంటే చాలు.

ఇ విటమిన్‌: 

నట్స్‌, పాలకూర, మొలకెత్తిన గింజలు, కోడిగుడ్లు, సోయా ఉత్పత్తులు, ఆలివ్‌ నూనెలు, కొన్ని రకాల వెజిటబుల్‌ నూనెల నుంచి ఈ పోషకాన్ని పొందవచ్చు.

లైకోపిన్‌:

 అన్ని రకాల ఎర్రరంగు పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుందిది. ముఖ్యంగా టమాటాలు, పుచ్చకాయ, బొప్పాయి, ఎర్రగా పండిన జామ, ఎర్రద్రాక్ష వంటివి లైకోపిన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.

 వీటంన్నిటితో పాటు చర్మానికి తేమ అందడం కోసం మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు వెలుపలికి పంపిచవేయబడుతుంది. ఫలితం మెరిసే మేని మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.

Comments