సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంతోనే మనకు శక్తి చేకూరుతుంది. అంతే కాదు... మనలోని రక్షణ వ్యవస్థ అయిన వ్యాధినిరోధకశక్తిని కల్పించేది కూడా మనం తీసుకునే ఆహారమే. అన్ని పోషకాలతో కూడిన మంచి ఆహారం మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి కోటగోడలాంటి మొదటి అవయవం.. చర్మం. మరి అంత కీలకపాత్ర పోషించి చర్మ ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం గురించి, చర్మానికి మంచి చేసే పదార్థాల గురించి తెలుసుకుందాం...
చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్థకాలంతో పాటు యవ్వనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలను పరిశీలిస్తే..
యాపిల్
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో
తాజా పండ్లు-ఆరెంజ్
అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
బాదాం,చేపలు
అవిశలు: బాదం, చేపలు, అవిశగింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. చేపల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది.
ముడిబియ్యం, పొట్టు తియ్యని ధాన్యాలు
ఆహారం తీసుకోవడం లోనూ, ఆహార పదార్థాలను ఎన్నుకోవడంలోనూ సరైన అవగాహన వుంటే శారీరక సౌందర్యం, ఆరోగ్యం బాగుంటాయి. స్థూలకాయం ఏర్పడకుండా, పొట్ట ఎత్తుగా పెరగ కుండా
కాలీఫ్లవర్, అవకాడో, వాల్ నట్
కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్ నట్, అవొకాడోలలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోనుల సమతుల్యత వల్ల వచ్చే మొటిమలను విటమిన్ బి6 నివారిస్తుంది.
1.యాపిల్:
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. యాపిల్ చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఇందులో క్యాలరీలు, యాంటీ ఆక్సిండెంట్స్ ఎక్కువ. తక్షణ శక్తిని ఇస్తాయి. దీర్ఘకాలం చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది యాపిల్. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.
2.తాజా పండ్లు-ఆరెంజ్:
అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నారింజ, జామ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి యాంటిఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలా కాలం పాటు యవ్వనంగా ఉండాలంటే తాజా పండ్లను ప్రతి రోజూ తినాలి.
3. బాదాం,చేపలు,
అవిశలు: బాదం, చేపలు, అవిశగింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. చేపల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి తేమనందించి, నునుపుగా తయారుచేస్తుంది. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుకుగా ఉండే చర్మాన్నినునుపుగా మార్చే శక్తి వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
4. ముడిబియ్యం, పొట్టు తియ్యని ధాన్యాలు:
ఆహారం తీసుకోవడం లోనూ, ఆహార పదార్థాలను ఎన్నుకోవడంలోనూ సరైన అవగాహన వుంటే శారీరక సౌందర్యం, ఆరోగ్యం బాగుంటాయి. స్థూలకాయం ఏర్పడకుండా, పొట్ట ఎత్తుగా పెరగ కుండా, శరీరంలో కొవ్వు పేరుకోకుండా, తగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముడి బియ్యం, పొట్టు తియ్యని ధాన్యాలు, బార్లీ, పొట్టు గోధుమల బ్రెడ్ (వీటిలో పీచు ఎక్కువ) . ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడుతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి.
5. కాలీఫ్లవర్, అవకాడో, వాల్ నట్:
కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్ నట్, అవొకాడోలలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోనుల సమతుల్యత వల్ల వచ్చే మొటిమలను విటమిన్ బి6 నివారిస్తుంది. హార్యోన్ ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది.
Comments
Post a Comment