గడ్డంపై బ్లాక్ హెడ్స్ ను నివారించడం ఎలా

ముఖం మీద అక్క‌డ‌క్క‌డా క‌నిపించే చిన్న చిన్న న‌ల్ల‌ని మ‌చ్చ‌ల‌నే బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి వ‌స్తే ముఖం చూడడానికి ఏమాత్రం అందంగా క‌నిపించ‌దు. దీంతో బ్లాక్ హెడ్స్ రాగానే ఎవ‌రైనా ఒకింత ఆందోళ‌న‌కు గుర‌వుతారు. అంతే కాదు వీటిని తొలగించుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ముఖ్యంగా గడ్డం మీద వచ్చిన బ్లాక్ హెడ్స్ ను తొలగించే క్రమంలో బ్యూటీ స్టోర్స్ లో తెచ్చిన ప్రొడక్ట్స్ కొంచెం నొప్పిని కూడా కలిగించవచ్చు.

 కాబట్టి, స్కిన్ కేర్ ఎక్సపర్ట్స్ ఎల్లప్పుడు న్యాచురల్ రెమెడీస్ నే ఎంపిక చేసుకోమని సూచిస్తుంటారు.ముఖ్యంగా గడ్డం మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి ఎలాంటి రెమెడీస్ ఉపయోగపడుతాయన్న ఆలోచన మీలో రావచ్చు. అందుకే మీకోసం కొన్ని న్యాచురల్ పదార్థాలను లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే బ్లాక్ హెడ్స్‌ను సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు.
ఈ పదార్థాలన్నింటిలోనూ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి ఎక్సెస్ సెబమ్ ను తొలగించి, చర్మరంద్రాలను శుభ్రపరుస్తుంది, మురికిని తొలగిస్తుంది, గడ్డం మీద ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ తొలగించి తిరిగి రాకుండా చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం గడ్డంపై బ్లాక్ హెడ్స్ తొలగించే చిట్కాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. సీ సాల్ట్

 సముద్రపు ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది సెల్ టర్నోవర్ మరియు మూసుకుపోయిన రంద్రాలను తెరచుకునేలా చేస్తాయి. దాంతో బ్లాక్ హెడ్స్ తొలగించడానికి సులభం అవుతుంది
ఎలా ఉపయోగించాలి:
చిటికెడు సీసాల్ట్ లో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ కలిపి, పేస్ట్ లా చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. టీట్రీ ఆయిల్

 టీట్రీ ఆయిల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ చర్మ రంద్రాల్లోన్ని టాక్సిన్స్ ను తొలగిస్తుంది, దాంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
ఎలా ఉపయోగించాలి:
రెండు చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని అందులో అరటీస్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న గడ్డానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. విటమిన్ సి పౌడర్ 

గడ్డం మీద ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి విటమిన్ సి పౌడర్ గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేయడం వల్ల గ్రేట్ రెమెడీ.
ఎలా ఉపయోగించాలి:
అరటీస్పూన్ విటమిన్ సి పౌడర్ లో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న గడ్డంపై అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4. అలోవెర జెల్

 అలోవెర జెల్లో బ్లాక్ హెడ్స్ తో పోరాడే యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బ్లాక్ హెడ్స్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .
 ఎలా ఉపయోగించాలి:
అలోవెర జెల్ ను కొద్దిగా తీసుకుని, గడ్డానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. ఓట్ మీల్ 

ఓట్ మీల్లో ఎక్స్ ఫ్లోయేటింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్లాక్ హెడ్స్ ను ట్రీట్ చేయడంలో ఉత్తమ రెమెడీ.
 ఎలా ఉపయోగించాలి:
అరటీస్పూన్ ఉడికించిన ఓట్ మీల్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డం మీద అప్లై చేసి రుద్దాలి. కొన్ని నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. ఫేషియల్ స్టీమ్

 ఫేషియల్ స్టీమ్ కూడా బ్లాక్ అయిన చర్మ రంద్రాలు తెరచుకునేలా చేస్తాయి. తర్వాత బ్లాక్ హెడ్స్ ను తొలగించి, శుభ్రపరుస్తుంది.
ఎలా వాడాలి:
ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకుని, తల నిండుగా మందంగా ఉండే బెడ్ షీట్ ను కప్పుకుని ఆవిరి పట్టాలి. 10-15నిముషాలు ఆవిరి పట్టాలి. వారంలో ఒకసారి ఇలా ఆవిరి పట్టడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

7. ఆరెంజ్ పీల్ పౌడర్:

 మరో రిమార్కబుల్ రెమెడీ, ఆరెంజ్ పీల్ పౌడర్. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అలాగే బ్లాక్ హెడ్స ను తొలగించడానికి సహాయపడుతాయి.
ఎలా ఉపయోగించాలి:
అరచెంచా ఆరెంజ్ పీల్ పౌడర్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గడ్డంకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. బేకింగ్ సోడ 

బేకింగ్ సోడ బ్లాక్ హెడ్స్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. గడ్డం మీద రుద్దడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డీప్ గా శుభ్రం చేసి, బ్లాక్ హెడ్స్ తొలగిస్తాయి.
ఎలా ఉపయోగించాలి:
 బేకింగ్ సోడ చిటికెడు తీసుకుని, ఒక టీస్పూన్ డిస్టిల్డ్ వాటర్లో కలపాలి. ఈ పేస్ట్ ను గడ్డానికి అప్లై చేసి, డ్రై అయిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. బ్లాక్ హెడ్స్ వెంటనే తొలగిపోతాయి.

9. తేనె, నిమ్మరసం: 

తేనె, నిమ్మరసం రెండూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బ్లాక్ హెడ్స్ తొలగించడంలో వీటిలోని ఆస్ట్రిజెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సహాయపడుతాయి. ఈ రెమెడీని వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎలా ఉపయోగించాలి: 4-5 చుక్కల తేనెకు 1/2 టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమానని బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.




Comments