మొటిమలకు చెక్ పెట్టండిలా..?

ప్రకృతి ప్రసాదించిన పచ్చని చెట్లు సహజసిద్ధమైన ప్రాణ వాయువుతో పాటు సౌందర్య సంరక్షణకు తోడ్పాటునందిస్తాయి. 'మొక్కే కదా అది అని తీసి పారేయకుండా'వాటి విశిష్టతలను తెలుసుకుని సౌందర్య పోషణకు ఉపయోగించుకోండి. 

- వేపాకు రసం ముఖవర్చస్సుకు మరింత తోడ్పాటునందిస్తుంది. ముఖం పై వ్యాపించే మొటిమలతో పాటు నల్లటి మచ్చల నివారణకు వేపాకు సారం బేషుగ్గా పనిచేస్తుంది. వేపాకు రసంలో చందనాన్ని జోడించి ముఖానికి ఆప్లై చేయండి. అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరిస్తే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. - తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించి రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖం పై లేయర్ లా వేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ్యడం వ్లల ముఖం పై పేరుకున్న జిడ్డు, మొటిమలు తగ్గుతాయి.

Comments