ఇంట్లో టమోటో లేనిదే వంటలు రుచించవు కొందరికి. విరివిగా లభించే టమాటాలతో.. ఊరగాయలు పెట్టడం.. వంటకాల్లో విరివిగా వాడటమే కాదండోయ్... అప్పుడప్పుడు ఆ గుజ్జును ముఖానికీ కొద్దిగా రాసుకుని చూడండి. ఈ ఎండ, వేడి కారణంగా బాధించే కొన్నిరకాల చర్మ సమస్యలను చాలా సులువుగా నివారించవచ్చు. సహజ సన్ స్క్రీన్ లా పనిచేసే టమాటాతో మొటిమలు, రాషెస్, ఎండ వల్ల కమిలిన చర్మం నిగారింపును పొందడమే కాదు.. ఆరోగ్యంగానూ ఉంటుంది. వార్థక్యపు చాయల్ని నివారించే గుణం టమాటాల్లో ఉంది.
1. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు ఒక టమాటాను గుజ్జులా చేసి వడకట్టాలి. దీనికి కొద్దిగా కీరదోస రసం కలిపి దూదితో ముఖమంతా రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఎండ, అతి వేడి వల్ల చర్మం ఎర్రగా మారి కమిలిపోతుంది. టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.
2. టమాటాల్లోని ఆమ్లాలు యాక్నె సమస్యను చాలామటుకు నివారిస్తాయి. అదెలాగంటే.. యాక్నెను నివారించేందుకు వాడే క్రీంలలో ఎక్కువగా ఎ, సి విటమిన్లు ఉంటాయి. టమాటాల్లోనూ ఈ పోషకాలతోపాటు కె విటమిన్ కూడా లభిస్తుంది. యాక్నె సమస్య చాలా తక్కువగా ఉన్నట్లయితే..టమాటా ముక్కను తీసుకుని ముఖమంతా రాసుకుని కాసేపు వదిలేయండి. టమాటా గుజ్జును పూతలా వేసుకోవాలి. తరచూ చేస్తుంటే.. క్రమంగా మార్పు వస్తుంది.
3. తాజా టమాటా రసం ఓ టేబుల్ స్పూను తీసుకుని నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖమంతా రాసుకోవాలి. సవ్యదిశలో మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లనినీటితో కడిగేసుకోవాలి. చర్మంపై పేరుకున్న అధికజిడ్డు, మురికి వదులుతుంది.
4. టమాటారసం చిక్కని మిశ్రమం అయ్యేదాకా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత కడిగేయాలి. ఎండ కారణంగా నల్లగా మారి జీవం కోల్పోయిన చర్మానికి మెరుపునందించే పూత ఇది. అలాగే కీరదోస, తేనె టమాటా గుజ్జు కలిపి రాసుకున్నా కూడా తేడా కనిపిస్తుంది.
5. చర్మంలో తెరుచుకున్న గ్రంథులు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఎక్కువగా వేధిస్తుంటే... టమాటాను స్త్లెసులా కోసి.. ముఖమంతా రుద్దాలి. ఇందులోని పొటాషియం, విటమిన్ సి సుగుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి.
6. టమాటాతో ఇంట్లోనే క్లెన్సర్ ను తయారు చేసుకోవచ్చు. టమాటాగుజ్జుకు సమపాళ్లలో పాలు కలపాలి. దీన్ని సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ముఖం, మెడకు రాసుకుని మునివేళ్లతో మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక చల్లనినీటితో కడిగేసుకుంటే.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
7. ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది.

Comments
Post a Comment