పండ్ల రసాలా బాత్ ట్రీట్ మెంట్ తో యవ్వనం మీ సొంతం...

శరీరాన్నిచ, చర్మాన్ని సున్నితంగా, నునుపుగా, అందరిలోనూ కాంతివంతంగా కనబడేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అందులో ఒకటి బాత్ ట్రీట్ మెంట్. బాత్ ట్రీట్ మెంట్ లో కొన్ని ఉపాయాలున్నాయి. వాటిని కనుక పాటించినట్లైతే మీ చర్మం సున్నితంగా , నూతన కాంతితో మెరిసిపోతుంటుంది. బాత్ ట్రీట్ మెంట్ తీసుకొన్న తర్వాత మీ చర్మాన్ని పరీక్షించుకొన్నట్లైతే సున్నితమైన చర్మం యొక్క మార్పు మీకే తెలుస్తుంది. కాబట్టి మీ చర్మాన్ని సున్నితంగా, కాంతి వంతంగా ఉంచుకొనేందుకు బాత్ ట్రీట్ మెంట్ కోసం కొన్ని చిట్కాలు మీ కోసం....

ఒత్తడి నుండి విముక్తి: 

బాత్ ట్రీట్ మెంట్ లో మొదటి ఉపాయాన్ని పాటించినట్లైతే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. అందుకు చేయాల్సిందల్లా మీ బాత్ టబ్ లేదా మీరు స్నానం చేయబోయే బకెట్ నీటిలో కానీ మూడు కప్పుల చామోమిలే టీను కలుపుకోవాలి. చామోమిలే నీటిలో వేసి స్నానం చేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

 ఆయిల్ స్కిన్(జిడ్డు చర్మతత్వం): 

జిడ్డు చర్మ తత్వం కలవారు మీరు స్నానం చేయబోయే నీటిలో లేదా బాత్ టబ్ లో సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫలాలను లేదా ఫల రాసాలను కలుపుకోవాలి. ఉదా: సిట్రిక్ యాసిడ్ కలిగిన ఫలాలు నిమ్మకాయ, ఆరెంజ్ మరియు ద్రాక్ష వంటి పండ్లు. సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాను హతమార్చుతుంది. చర్మంలోనున్న మలినాలను తొలగిస్తుంది. మరియు చర్మంలో నున్న ఎక్సెస్ ఆయిల్ ను తగ్గిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అల్టిమేట్ ఆరోమా థెరఫీ లాంటిదే. వీటికి బాగా పండిన పండ్లను ఉపయోగించడం మరీ మంచిది.

 పొడి చర్మానికి :

 పొడిచర్మ తత్వం కలవారు చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి స్నానానికి వినియోగించే నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసుకోవాలి. ఇది పొడి చర్మనాకి బాగా పనిచేస్తుంది. అలాగే అందులో రోజ్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపడం వల్ల పొడి చర్మాన్ని తడిగా మార్చి చర్మం తాజాగా ఉండేట్లు ఉపయోగపడుతుంది. మీరు సహజ సిద్దమైన పద్దతిని కోరుకొంటున్నట్లైతే మీరు స్నానానికి ఉపయోగించే నీటిలో కొన్ని గులాబీ రేకులు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. రోజ్ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచి అద్భుతమైన సువాసనను వెదజల్లుతుంది. అవసరమైతే ఈ నీటిలో కొద్దిగా పాలు కూడా కలుపుకోవచ్చు.

స్కిన్ సాఫ్ట్ గా ఉండేందుకు: 

ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల ఓట్ మీల్, రెండు కప్పుల గోధుమ నూక, మరియు అరకప్పు ఆలోవెరా జెల్ దీని స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని నైలాన్ క్లాత్ లో వేసి వడగట్టి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. స్నానం ముగించిన తర్వాత టీ బాగ్ ను చర్మాన్ని శుభ్రం చేసుకోవాడానికి ఉపయోగించవచ్చు. టీ బ్యాగ్ లను స్నానంచేయు నీటిలో వేసి ఉపయోగించడం వల్ల వయస్సు పైబడిన వారిగా కనపడనివ్వకుండా చేస్తుంది. ఈ స్నానం కనీసం 15 నిమిషాలైనా చేయాల్సిందే.
 రెండు టీస్పూన్ల అల్లం రసంలో రెండు టీస్సూన్ల ఆవపిండిలో వేసి బాగా మిక్స్ చేయాలి దీన్ని స్నానానికి ఉపయోగించడం వల్ల ఉదర సంబంద సమస్యలు తొలగిపోతాయి.


Comments