అందం కోరుకుంటున్నారా.. త్వరగా నిద్రపోండి!!

''ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా సౌందర్యం విషయంలో 'ఫలితం శూన్యం' అంటూ నిర్వేదంలో ఉన్నారా..?, మీ 'సౌందర్యం' క్షీణించటానికి గల కారణాలు అంతు చిక్కటం లేదా..?, ఆ చిన్న పొరపాటు ఏంటో గ్రహించలేకపోతున్నారా..?''

 నేటి తరం యువతి యువకులు యుక్త వయస్సులోనే కాంతిహీనులవాటానికి కారణం నిద్రలేమేనంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర ప్రణాళికలో జరుగుతున్న లోపాల కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందట. నిద్ర విషయంలో నేటి తరం యువత చేస్తున్న తప్పులను ఇప్పటికైనా గ్రహించి ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని పలు సూచనలు చేస్తున్నారు.
 - రాత్రి మేల్కొని పగలు నిద్ర పోవడం మంచి పద్దతి కాదు. పగటి నిద్రపోవడం వల్ల జీర్ణ ప్రక్రియలో లోపాలు తలెత్తటంతో పాటు శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది.
 - సాధ్యమైనంత వరకు రాత్రి 10 గంటలలోపు నిద్రపోవటంతో పాటు, ఉదయం 6 గంటల లోపు నిద్ర లేవాలి.
 - అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా మెలగాలన్నా నిద్ర విషయంలో ఏమాత్రం ఆశ్రద్ధ వహించకూడదు.


Comments