బాదాం నూనెతో మీ సౌందర్యాన్ని పెంచుకోండి...!

మన రోజువారి జీవితంలో బాదం పప్పును ఏదో రూపంలో వాడుతూనే ఉంటాం. బాదం పాలు, బాదం హల్వా, బాదం టీ... ఇలా చెప్పుకుంటూ పోతే బాదంపప్పుతో తయారు చేసే వాటి జాబితా పెరుగుతూనే ఉంటుంది. పచ్చి గింజలు తినవచ్చును , రోస్ట్ చేసికొని తింటే చాలా బాగుంటాయి . బాదం సిరప్ , నూనెను వాడుతారు. చర్మసంరక్షణకు బాదం చాలా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని కోరుకునేవారు బాదం పప్పుని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో లబించే విటమిన్ "ఇ" యాంటి ఆక్షిడేంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు. నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రసాయనాలతో తయారైన ఉత్పత్తులను క్రీములను ఉపయోగించడం కంటే ఈ బాదాం ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరి ఆ బాదాం ఆయిల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో చూద్దాం...

మాయిశ్చరైజర్: 

బాదాం ఆయిల్ అన్ని రకాల చర్మ తత్వానికి బాగా పని చేస్తుంది. ఇది పొడి చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం ఇలా అన్ని చర్మాలకు ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఇది చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలోని బాగా ఇంకి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది పొడి చర్మానికి బాగా పనిచేస్తుంది. చర్మాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్లు చూస్తుంది. అందుకు ప్రతి రోజూ ఈ ఆయిల్ తో రెగ్యులర్ గా మసాజ్ చేయాలి. తెగిన గాయలకు, చీలిన చర్మాన్ని సున్నితంగా తయారు చేసే వండర్ ఫుల్ వస్తువు.

పగిలిన పెదాలకు దివ్య ఔషదం: బాదాం నూనె బ్యూటీ సీక్రెట్ ఏంటే చర్మ సంబంధ సమస్యలను పూర్తిగా నయం చేస్తుంది. పగిలిన పెదాలకు పెట్రోలియం జెల్లి, లిప్ గ్లాస్ లను ఉపయోగించడం కంటే బాదాం నూనెను ఉపయోగించడం వల్ల పెదాలు ఎప్పుడు సున్నితంగా సుకుమారంగా ఉంటాయి. 5-6చుక్కల బాదాం నూనె, ఒక చెంచా తేనెను తీసుకొని బాగా మిక్స్ చేయాలి. చిన్న డబ్బాలో తీసి పెట్టుకొని వారానికి ఒకసారి ఉపయోగిస్తుండాలి. పెదాలు ఎప్పుడు తడారినట్లు తెలిసినా వెంటనే ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల సున్నితంగా తయారవ్వడమే కాకుండా పింక్ కలర్ లోనికి మారుతాయి.

ముడతలు:

 బాదాం నూనెలో విటమిన్ ఎ మరియు బి ఉండి ఎక్కువ ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ముఖ్యంగా కళ్ళక్రింది, మూతి దగ్గర ఏర్పడ్డ ముడతలను అతి త్వరగా పోగొడుతుంది. వయస్సు పై బడే లక్షణాలను ధరిచేరనివ్వదు. కనబడనివ్వదు. ఈ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా కనబడుతారు.

నల్లటి వలయాలు:

 బాదాం నూనె మల్టిపుల్ బెనిఫిట్స్ ను కలిగి ఉంటుంది. కళ్ళ దగ్గర ఏర్పడ్డ బ్లాక్ సర్కిల్స్ ను తొలగిపోయేలా సహాయపడుతుంది. ప్రతి రోజూ బాదాం నూనెలో కాటన్ బాల్స్ ను అద్ది కళ్ళ చుట్టూ మసాజ్ చేస్తుంటే నల్లటి వలయాలు మటుమాయం అవుతాయి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని వారాలకు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

 స్క్రబ్బింగ్: 

బాదాం నూనె ఫేషియల్ స్క్రబింగ్ గా కూడా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలో ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఒక చెంచా పంచదారలో ఒక చెంచా బాదాం ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి బాగా స్ర్కబ్ చేసి తడి ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Comments