పంచదార బొమ్మకి పంచదార సౌందర్యం...

ముందు పంచదారను వైట్ గోల్డ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఇది అరుదుగా దొరికే వస్తువు కాదు కాబట్టి ముందు దీని విలువ కూడా ఎక్కువగా ఉండేది. పంచదార స్వీట్స్ తయారు చేయడంలో అతి ముఖ్యమైన వస్తువు. ప్రస్తుతం దీన్ని చర్మ సౌందర్య సాధనాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగించడం వల్ల చర్మానికి సహజ సౌందర్యాన్ని అందిస్తుంది. ముఖంలో రంధ్రాలు, మతకణాలు ఏర్పడకుండా చేసతుంది. చర్మంలోని నూనె గ్రంధులను సమతుల్యం చేస్తుంది. ముఖ చర్మం జిడ్డు బారకుండా చేస్తుంది.

 పంచాదర గ్లైకోల్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయ పడుతుంది. నేచురల్ గ్లైకోల్ యాసిడ్ చర్మానికి మంచి కండీషనర్ గాను మాయిశ్చరైజర్ గాను, టాక్సిన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. పంచదారతో ప్రతి రోజు స్ర్కబ్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. డెడ్ స్కిన్ ని తొలగించి తాజా చర్మ సౌందర్యాన్ని ఏర్పరుస్తుంది. చాలా సున్నితంగా తయారవుతుంది. పంచదార స్ర్కబ్బింగ్ అన్ని రకాల చర్మాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది.

చర్మ సౌందర్యంపై నేటి యువతరం ఎంతగానో జాగ్రత్త పడుతుండటం తెలిసిన విషయమే. మరి పంచదారలో చర్మ రక్షణ అంశాలు ఎంతవరకు ఉన్నాయని తెలుసుకుందామా? పంచదార మృతకణాలను నశింపజేస్తుందని బ్యూటీషియన్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుందని వారు చెబుతున్నారు.

 మరీ పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకునే విధానం మీ కోసం... పావు కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు ముదురు రంగు చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి పంచదార అణువులు కరిగే వరకు రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మ మృదువుగా, తేమగా

 పెరుగులో కొద్దిగా పంచదార కానీ లేదా ఉప్మారవ్వగానీ వేసి బాగా కలిపి, ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

చర్మసౌందర్యంతో పాటు బాక్టీరియాను హరింపజేసే లక్షణం కూడా పంచదార కుందని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు. గాయాలను మాన్పడం, ఇన్ఫెక్షన్లను తొలగించే నివారిణిగా పంచదార ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఇక చర్మాన్ని బిగుతుగా ఉంచే యాంటీ ఏజింగ్ క్రీముల్లో తేనెను వాడతారు. ముఖం మీద మచ్చలకు కూడా తేనెను వాడుతారని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

Comments