గృహినులు, ఉద్యోగినులు రకరకాల ఇంటిపనులు, అటు ఆఫీస్ పనులు చేయటం వల్ల మహిళల చేతులు గరుకుగా తయారువుతాయి. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకూ బాహ్య సౌందర్యం పట్ల తీసుకునే శ్రద్ద ఈ రోజుల్లో ఎంతగా ఉన్నదో విధితమే. అందాన్ని పెంచేవాటిల్లో మేకప్ ప్రధానమైనది. అందులో ప్రస్తుతం అనేక రకాలు వచ్చాయి... వస్తున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి అనేక కాస్మొటిక్ కంపెనీలు ఆవిర్భవించాయి. కాటుక మొదలుకొని గోళ్లరంగు వరకు అనేక వెరైటీలు వచ్చేశాయి.
1. నిమ్మరసం, మజ్జిగ సమభాగాలు కలిపి ముఖానికి మర్దన చేయడం వల్ల ఎండకు నల్లబడిన ముఖము స్వచ్ఛముగా కనిపిస్తుంది. ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతంగా అవుతుంది.
2. బాగా కాగబెట్టిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. కుంకుమ పువ్వు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌందర్య సాధనంగా ప్రసిద్ధిపొందింది. ఈ పువ్వుతో తయారయిన పేస్టును ముఖము, చేతులపైన రాసుకుంటే చర్మానికి మృదుత్వము, బంగారు మెరుపును తెస్తుంది. 4. స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.
5. వంటింట్లో దొరికే పసుపు, మన పెరడు లో దొరికే వేపఆకు చూర్ణం, కుంకుమ పొడి చెరో చెంచా చొప్పును తీసుకొని పచ్చిపాలలో వేసి కలిపి ముఖానికి ఇతర చర్మభాగాలకు రాస్తే నల్ల మచ్చలు, దద్దుర్లు వంటివి పోతాయి. దాంతో చర్మం చల్లగాను, హాయిగాను, మేలి చాలయతో మెరుస్తుంది.
6. మంచి గందం పొడి, పాలతో పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి, మెడకు మర్ధన చేసినట్లైతే చర్మం సున్నితంగా ఉంటుంది. అంతే కాకుండా గంధం పేస్ట్ చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మం పొడిబారడం, పొరలుగా రావడం వంటివి జరగవు.

Comments
Post a Comment