శరీరంలో ఏదైనా బాగంలో చర్మం అధికంగా పెరిగితే స్కిన్ టాగ్ అని పిలుస్తారు. స్కిన్ టాగ్స్ హాని చేయని కణితులు మరియు ఇవి తరచుగా మెడ చర్మం, చర్మం ముడతలు, బాహుమూలలు మరియు తొడలలో పెరుగుతాయి. అంతేకాక ఇవి కనురెప్ప, ముఖం లేదా చేతుల సమీపంలో ఆకస్మికంగా పెరిగి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.
అయితే వీటి పెరుగుదలకు ఎటువంటి ఖచ్చితమైన కారణం లేదు. కానీ ఇవి ఓబేసిటి, ప్రెగ్నెన్సీ, వయస్సు రిత్యా, జన్యు, హార్మోన్ల మార్పులు, అలెర్జీలు మరియు స్థూలకాయం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. వీటిని కొన్ని ఇంటి నివారణల ద్వారా తొలగించవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
స్కిన్ ట్యాగ్స్(పిలిపిర్లు) నివారించే ఉత్తమ చిట్కాలు
దారం సాయంతో లాగుట
ఇది ఏదైనా శరీర బాగం నుండి స్కిన్ ట్యాగ్ తొలగించటానికి ఒక పరిహారంగా ఉంది. సాధ్యమైనంత శరీరానికి దగ్గరగా పులిపిర్ల మీద దారం చుట్టి గట్టిగా ముడి వేయాలి. క్రమంగా పులిపిర్లు పరిమాణంలో చిన్నదిగామారి చివరికి ఊడిపోతుంది.దారం మురికి పట్టి లేదా మాసిపోయినట్లైతే దారం మార్చాలి.
నెయిల్ పాలిష్ తో ఆస్ఫిక్సేషన్ తో :
ఆస్పిక్సేషన్ , నెయిల్ పాలిష్ ఉపయోగించి తొలగించుకోవచ్చు. ఆక్సిజన్ సప్లే కాకుండా చేస్తే స్కిన్ ట్యాగ్స్ తొలగిపోతాయి. నెయిల్ పాలిష్ తీసుకుని, పులిపిర్లు మీద అప్లై చేయాలి. శుభ్రం చేసుకోవాలి. రోజుకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రోజుల్లో తప్పకుండా మార్పు కనబడుతుంది.
ఫిగ్ స్టెమ్
మరో హోం రెమెడీ, ఫిగ్ ఫ్రూట్(అంజూర)చెట్టు బెరడను ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి జ్యూస్ లా గ్రైండ్ చేసుకుని పులిపిర్ల మీద అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత కాటన్ తో తొలగించాలి.
స్కిన్ ట్యాగ్స్ (పులిపిర్లు)మాయం చేసే సులభ చిట్కాలు
డాండలైన్ స్టెమ్
డాండలైన్ స్టెమ్ లో మిల్క్ ఫ్లూయిడ్ ఉంటుంది. డాండలైన్ బెరడు నుండి కారే పాలను స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. ఈ డ్యాండలైన్ హోం రెమెడీ, ఇతర చర్మ సమస్యలను నివారిస్తుంది. డాండలైన్ స్టెమ్ మిల్క్ ను అప్లై చేసి ఆరిన తర్వాత తిరిగి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన ప్రతి సారి పులిపుర్లు డ్రైగా మారి తగ్గడం తెలుస్తుంది.
విటమిన్ ఇ క్యాప్స్యూల్స్
విటమిన్ ఇ క్యాప్స్యూల్ ను బ్రేక్ చేసి, లోపల ఉన్న పదార్థాన్ని స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. విటమిన్ ఆయిల్ నేరుగా పులిపిర్లి మీద అప్లై చేస్తే చాలు స్కిన్ ట్యాగ్స్ మాయం అవుతాయి. అయితే దీన్ని అప్లై చేయడానికి ముందు పులిపిర్లను శుభ్రం చేయాలి.
ఓరిగానో ఆయిల్
ఓరిగానో నూనె మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. అందుకు ఫ్రెష్ ఓరిగానో మరియు ఆలివ్ ఆయిల్ అవసరం అవుతుంది. ఈ రెండూ మిక్స్ చేసి ఒక నెల రోజుల పాటు అలాగే నిల్వ చేయాలి. అంతే ఓరిగానో ఆయిల్ రెడీ, దీన్ని నేరుగా పులిపిర్లి మీద అప్లై చేయాలి..
ఐయోడిన్
స్కిన్ ట్యాగ్స్ కు అయోడిన్ బాగాపనిచేస్తుంది, అయితే ఐయోడిన్ అప్లై చేసేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయోడిన్ లిక్విడ్ లో ఇయర్ బడ్ డిప్ చేసి, స్కిన్ ట్యాగ్ మీద అప్లై చేయాలి. పులిపుర్ల్ మీద మాత్రమే అప్లై చేయాలి. స్కిన్ ట్యాగ్స్ చుట్టూ కొబ్బరి నూనె అప్లై చేయాలి.
బ్లడ్ రూట్ పేస్ట్
పిలిపుర్లు మీద త్వరగా రియాక్ట్ అయ్యే హోం రెమెడీ బ్లడ్ రూట్ పేస్ట్. ఫ్రెష్ గా ఉండే బ్లడ్ రూట్ స్టెమ్ తీసుకొచ్చి మిక్సీలో వేసి మొత్తగా పేస్ట్ చేయాలి. మొదట హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పిలిపిర్లను శుభ్రం చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను నేరుగా అప్లై చేయాలి. దీన్ని ఒక వారం రోజులు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Comments
Post a Comment