స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి చార్కోల్ (బొగ్గు)ఫేస్ మాస్క్

చార్కోల్ దీన్ని బొగ్గు అని పిలుస్తారు. గుర్తుందా చార్కోల్? ఒకప్పుడు దీన్ని పళ్లు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దీన్నే టూత్ పౌడర్ గా వాడతారు. అంతేకాదు.. పూర్వపు పద్ధతులకు మేకప్ చేసి.. ఇప్పుడు చార్కోల్ పేస్ట్ లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరి దీన్ని మన పూర్వీకులు ఊరికే వాడి ఉంటారా ? మంచి ఫలితాలు చూసే ఉంటారు కదూ? అయితే ఇది కేవలం పళ్లు తెల్లగా మార్చడానికే కాదు.. మిమ్మల్ని అందంగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుందంటే నమ్మలేరు కదూ!!

 బొగ్గుని చర్మంపై రుద్దడం వల్ల.. మిమ్మల్ని థ్రిల్ చేసే రిజల్ట్స్ ఉంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అంతేకాదు రెగ్యులర్ గా దీన్ని బ్యూటీ సీక్రెట్ గా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. దీన్ని చర్మంపై రబ్ చేయడం వల్ల టాక్సిన్స్ తొలగిపోయి.. డీప్ క్లెన్సర్ లా పనిచేస్తుంది.

ఫర్ఫెక్ట్ క్లియర్ స్కిన్ పొందడానికి 10 సింపుల్ స్టెప్స్ ..!! 

బొగ్గుని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే..అనేక బ్యూటీ బెన్ఫిట్స్ పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. పాయిజన్ తీసుకున్న వాళ్లకు యాక్టివేటెడ్ చార్కోల్ ని.. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి ఉపయోగిస్తారు.ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు మెరిసే చర్మానికి, ఆరోగ్యకరమైన జుట్టుకి కూడా ఉపయోగిస్తారు. మరి అందానికి చార్కోల్ ఎలా ఉపయోగపడుతుంది.. ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుందా? ఐతే ఇప్పుడే ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

బ్లాక్ హెడ్స్ ను తొలగించే చార్కోల్ మాస్క్ 

0.2 గ్రాముల చార్కోల్ పౌడర్లో అరటీస్పూను బెంటోనైట్ క్లే వేయాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసి, తర్వాత అందులోనే అరటీస్పూన్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. సున్నితమైన కళ్లు, పెదాల మీద వేసుకోకుండా అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంద్రాల్లో మురికి తొలగించే చార్కోల్ మాస్క్: 

కొబ్బరి నూనె, నీళ్లు మరియు యాక్టివేటెడ్ చార్కోల్ మూడు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి, మురికిని తొలగిస్తుంది. తిరిగి చర్మ రంద్రాలు మూసుకునేందుకు సహాయపడుతుంది. స్కిన్ కాంప్లెక్షన్ మెరుగుపడుతుంది. ముఖం అందంగా..

కాంతివంతం చేయడం కోసం ఉత్తమ చిట్కాలు

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే చార్కోల్ మాస్క్

 జెలిటిన్(అగర్ పౌడర్) ను వాటర్ తో మిక్స్ చేయాలి.ఇందులో చార్కోల్ మరియు క్యాల్షియం బెంటోనిన్ క్లే మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 10 నిముసాలు వేడి చేయడాలి. తేనెలా చిక్కగా మారే వరకూ వేడి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రీజర్ లో పెట్టి, 10 నిముషాలు తర్వాత బయటకు తీసి, ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆయిల్ స్కిన్ ను నివారించుకోవడానికి చార్కోల్ మాస్క్

 చార్కోల్ ఫేస్ మాస్క్ ను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు, చార్కోల్లో రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ను పీల్చేస్తుంది. దాంతో ఇన్ స్టాంట్ గ్లో పెరుగుతుంది.

మొటిమలను నివారించే చార్కోల్ మాస్క్

 బొగ్గుపొడిలో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి, ముఖానికి నేరుగా అప్లై చేయాలి. ఇది బ్రేక్ అవుట్స్ ను మరియు మొటిమలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది మొటిమలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి డిటాక్సిఫై చేస్తుంది.

 ఎగ్‌వైట్ మాస్క్‌తో తెల్లగా మారడం తేలికే..!!

డిటాక్సిఫికేషన్ చార్కోల్ మాస్క్

 2 చార్కోల్ క్యాప్స్యూల్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ బెంటోనైట్ క్లే వేసి , కొద్దిగా కొబ్బరినూనె, కొద్దిగా అవొకాడో ఆయిల్ మిక్స్ చేయాలి. అలాగే ఒక టీస్పూన్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇది పూర్తిగా డ్రైగా మారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

క్లెన్సింగ్ మాస్క్

 చార్కోల్ పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ప్లెయిన్ వాటర్ తో, అలోవెరజెల్ మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత డ్రైగా మారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చార్కోల్ పీల్ ఫేస్ మాస్క్

 సిలికాన్ గ్లౌజ్ కు చార్కోల్ పౌడర్ మిక్స్ చేసి, తర్వాత అంతే పరిమాణంలో నాన్ టాక్సిక్ వైట్ గ్లూ కూడా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీరు కూడా మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని, డ్రై అయిన తర్వాత పీల్ చేయాలి.










Comments