బీట్ రూట్ లో దాగున్న చర్మ సౌందర్య రహస్యాలు..

రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. బీట్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా.

ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు, సౌందర్యానికి పెంచే విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. బీట్ రూట్ రసంలో స్కిన్ టోన్ (చర్మ ఛాయను)మెరుగుపరిచే గుణాలు అధికం. చర్మంలో మచ్చలను తొలగిస్తుంది. అంతే కాదు అనేక రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. బీట్ రూట్ ను మీముఖానికి మాస్క్ లా అప్లై చేస్తే ఇది ముఖంలో మెటిమలు మచ్చలు తొలగిస్తుంది. పెదాలకు నేచురల్ పింక్ కలర్ ను అందిస్తుంది. అంతే కాదు మరి బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే...

చర్మ ఛాయను మెరుగు పరుస్తుంది:

 బీట్ రూట్ జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది . బీట్ రూట్ పేస్ట్ లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ గ్లో: 

బీట్ రూట్ రసంతో ముఖానికి శుభ్రం చేసుకుంటే ముఖంలో కొత్తకాంతలు ఏర్పడుతాయి. ఇలా వారంలో కనీసం ఒక రోజైనా చేయాలి.

ముడుతలను నివారిస్తుంది:

 బీట్ రూట్ జ్యూస్ ను చిక్కగా చేసి, ముడుతలున్న ప్రదేయంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల ముడుతలు మాయం అవుతాయి. బీట్ రూట్ మాస్క్ ను కనీసం వారానికి రెండు సార్లు వేసుకోవాలి.

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

 బీట్ రూట్ రసాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది. ముఖం మీద బీట్ రూట్ మాస్క్ పూర్తిగా తడి ఆరిన తర్వాత పాలతో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ కాంప్లెక్షన్: 

మీ స్కిన్ కాంప్లెక్షన్స్ నేచురల్ గా మెరుగుపరచాలంటే, ఈ సింపుల్ చిట్కాను అనుసరించాల్సిందే . బీట్ రూట్ జ్యూస్ కు టమోటో జ్యూస్ మిక్స్ చేసి, ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖంలో ఎలాంటి మచ్చలు ఉండవు.

డ్రై స్కిన్ నివారిస్తాయి:

 బీట్ రూట్ జ్యూస్ తో డ్రై స్కిన్ నివారించుకోవచ్చు . అందుకు మీరు చేయాల్సిందల్లా, బీట్ రూట్ జ్యూస్ లో కొద్దిగా తేనె మరియు పాలు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. తేమగా ఉంటుంది.

బీట్ రూట్ తో పింక్ లిప్స్:

 పెదాలు నేచురల్ గా పింక్ కలర్లో ఉండాలని కోరుకుంటే బీట్ రూట్ రసాన్ని పెదాల మీద అప్లై చేిస సున్నితమైన మసాజ్ ను చేయాలి. ఇలా రెగ్యులర్ గా రాత్రుల్లో చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నల్లని వలయాలను నివారిస్తుంది:

 బీట్ రూట్ రసం నల్లని వలయాలను తేలిక పరుస్తుంది . బీట్ రూట్ రసంలో ఉండే లక్షణాలు కళ్ళ ఉబ్బును కూడా నివారిస్తుంది.

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది :

 బీట్ రూట్ రసం మరియు షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి

మొటిమలను నివారిస్తుంది :

 రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా నివారిస్తుంది.











Comments