కలబందతో అందంగా మెరిసిపోవడం ఎలా?

సాధారణంగా దీనిని గార్డెన్లో అందంకోసమే పెంచుతుంటారు. క్రొత్తగా కట్టిన ఇళ్లకూ, భవంతులకూ కూడ దీన్ని దృష్టి దోషనివారణకోసం కడుతుంటారు. ఒక చిన్నమొక్కను తెచ్చి పెరట్లో నాటి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తుంటే చాలు. ఈ మొక్క ఎన్నో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. వేర్ల నుంచే మళ్లీ దీనికి మొక్కలు వస్తాయి. దీనిని ఇంగ్లీషులో అలోవేరా అంటారు.
కలబంద రసం వాడకం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసినవే. కలబంద రసం వలన కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే చాలా మంది అవగాహన కలిగి ఉన్నారు. కలబందలో ఉండే పోషకాలు, శరీరంలో ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తాయి. మన శరీరం స్వస్తతకు గురైనపుడు నయం చేయటానికి కావాల్సిన పోషకాలు అన్ని కలబంద రసంలో ఉంటాయి.
కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. విటమిన్ 'A', 'C', 'E', 'B1', 'B2', 'B3', 'B6', ఫోలిక్ ఆసిడ్ మరియు కోలీన్ వంటి ముఖ్యమైన విటమిన్ లన్నిటిని కలిగి ఉంటుంది. విటమిన్ 'B12' కలిగి ఉండే కొన్ని చెట్లలో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది.

 అలోవెర(కలబంద)తో జుట్టు సాప్ట్ గా ..షైనీగా..నిగనిగలాడుతుంది..! 

అలోవెర(కలబంద)ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో అలోవెరాను ఉపయోగించారు. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంలో అలోవెరాలోని ఔషద గుణాలు చురుగ్గా పనిచేస్తాయి. చర్మాన్ని మిలమిల మెరిపించి వయసు తగ్గించి చూపే కలబంద అందానికి ఎలాంటి మేలు చేస్తుందో తెలుసుకోండి మరి.

మృతకణాలను తొలగిస్తాయి. 

కలబందలో ఫాలీ సచార్డిన్స్, లెక్టిన్స్, మన్నన్ కాంపౌండ్స్ వంటి లక్షణాలుంటాయి. ఇవి చర్మంలోతుల్లోకి చొచ్చుకెళ్లి మృతకణాలను తొలగిస్తాయి.

 అలోవెరా(కలబంద) జ్యూస్ యొక్క ఆరోగ్యప్రయోజనాలు

చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

 చర్మ నిగారింపును పెంచి స్కిన్ ఎలాసిటీని మెరుగుపరుస్తుంది. కలబంద జెల్‌ను చర్మానికి నేరుగా అప్లె చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ముఖం మెరుస్తుంది.

 నిమ్మరసంలో కలిపిన కలబంద జెల్‌ని ముఖానికి అప్లె చేసి అరగంట తర్వాత కడిగితే ముఖం మెరుస్తుంది.

ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలతో పాటు, మృతకణాలు కూడా తొలగిపోతాయి.

 అలోవెరా పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత తొలగిస్తే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలతో పాటు, మృతకణాలు కూడా తొలగిపోతాయి.

 చుండ్రును నివారించడంలో అలోవెర(కలబంద)చేసే అద్భుతాలు...

ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకుంటుంది.

 బాదం నూనెలో అలోవెరా జెల్ కలిపి రాత్రి పడుకునే ముందు చర్మానికి అప్లె చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకుంటుంది.

ముఖం తెల్లబడుతుంది.

 ఒక టేబుల్‌స్పూన్ బత్తాయి తొక్కల పొడిలో, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంలో టేబుల్‌స్పూన్ కలబంద గుజ్జు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖం కడుక్కుని ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తెల్లబడుతుంది.






Comments