రోజంతా అందంగా ఫ్రెష్ గా కనబడుటకు సింపుల్ బ్యూటి అండ్ మేకప్ టిప్స్

మీ చర్మం హెల్తీగా మరియు కాంతివంతంగా కనబడుతుంటే ప్రతి రోజూ మేకప్ వేసుకోవల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకమైన దినాల్లో మేకప్ ను ప్రిఫర్ చేయవచ్చు.

 అందువల్ల మనం కొన్ని ప్రత్యేమైన నేచురల్ బ్యూటీ టిప్స్ ను అనుసరించడం మంచిది . అందంగా కనబడుటకు కెమికల్స్ రిలేటెడ్ కాస్మోటిక్స్ మరియు మేకప్ తో స్కిన్ ను కవర్ చేయడం కంటే నేచురల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల చర్మ సౌందర్యంను కాపాడుకోవచ్చు.

 హెల్తీ స్కిన్ కోసం రెండు విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ గా క్లీన్ చేసుకోడం మరియు ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ కు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను రెగ్యులర్ గా అందివ్వాలి.

 అంటే ఆరోగ్యంతో పాటు, అందాన్ని కాపాడుకోవడానికి హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి . అంతర్గతంగా చర్మాన్ని రక్షించే మంచి పోషకాహారాలను లోపలికి పంపించడంతో పాటు, బహిర్గతంగా కూడా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ఫ్రూట్ ప్యాక్స్ లను చర్మానికి అప్లై చేయాలి. చర్మానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ఇన్ సైడ్ మరియు అవుట్ సైడ్ ఉపయోగించడం వల్ల అందంగా ఆరోగ్యంగా కనబడుతారు . మరి ఆ సింపుల్ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం....

చిట్కా #1 :

 లిప్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి, టూత్ బ్రష్ తో పెదాల మీద స్ర్క బ్ చేయాలి. అయితే ఇలా చేయడానికి ముందు పెదాలకు ఎసెన్షియల్ ఆయిల్ ను మర్ధన చేసి పెదాలను సాఫ్ట్ గా అయిన తర్వాత స్రబ్ చేయడం వల్ల ఎక్స్ ఫ్లోయేట్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

చిట్కా #2 :

 గుర్తించుకోవల్సిన విషయం: ఫేవ్ లెస్ స్కిన్ పొందాలంటే, ప్రతి రోజూ రెగ్యులర్ గా క్లీనింగ్, మాయిశ్చరైజింగ్ తప్పనిసరి అవుతాయి. మరియు ఫేస్ ప్యాక్ మరియు వారం వారం స్కిన్ ఎక్స్ఫ్లోయేషన్ చాలా అవసరం అవుతుంది. ఇది ఒక అల్టిమేట్ నేచురల్ బ్యూటి టిప్.

చిట్కా #3 :

 మరో సింపుల్ బ్యూటీ టిప్స్ కళ్ళు అందంగా కనబడుటానికి లిక్విడ్ ఐలైనర్ ఉపయోగించాలి.

చిట్కా #4 :

 మస్కర, ఐలైనర్, ఐ మేకప్ వంటివి తొలగించడానికి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించాలి. కాటన్ బాల్స్ తీసుకొని ఆలివ్ ఆయిల్లో డిప్ చేసి కళ్ళకు అప్లై చేయాలి .

చిట్కా #5 :

 మీరు హెల్తీ స్కిన్ అండ్ కాంతివంతమైన స్కిన్ కలిగి ఉన్నట్లైతే ఫౌండేషన్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది . మీరు ఇప్పటికీ వాటిని ఉపయోగించుకోవాలనుకుంటే సందర్భాన్ని బట్టి వేసుకోవచ్చు.

చిట్కా #6 :

 వివిధ రకాల చర్మ సమస్యలున్న వారు ఫౌండేషన్ ఉపయోగించకూడదు . ఫౌండేషన్ ఉపయోగించడం వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోతాయి . దాంతో చర్మం మరింత అసౌకర్యానికి గురి అవుతుంది.

చిట్కా #7 :

 అందంగా కనబడాలనుకొన్నప్పుడు, మేకప్ వేసుకోవడానికి సమయం లేనప్పుడు సింపుల్ గా మస్కరాను అప్లై చేయాలి. మహిళలకు ఇది ఒక అద్భుతమైన బ్యూటి టిప్.

చిట్కా #8 :

 మంచి లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోవడం అందానికి ఒక కళ. మీ పెదాలకు నప్పేటటువంటి నేచరల్ కలర్ ను ఎంపిక చేసుకోవడం మంచిది ముఖ్యంగా పెదాలకు ఎంపిక చేసుకొనే కలర్స్ ఎత్తి కనబడనవసరం లేదు. నేచురల్ గా కనిపిస్తే అందంగా కనబడుతారు.

చిట్కా #9 :

 షైనింగ్ ఉన్న లిప్ స్టిక్ ను ఉపయోగించాలనుకొనే వారు, మొదట దంతాలను తెల్లగా మార్చుకోవాలి. అలా ఉన్నప్పడే అందంగా కనబడుతారు, ప్రతి ఒక్కరినీ ఆకర్షింపగలుగుతారు .












Comments