డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేయడానికి 5 ఫ్యాబులస్ హోం రెమెడీస్

ఎండ, కాలుష్యం, కెమికల్స్, స్మోకింగ్, పోషకాల లోపం మరియు ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చర్మం పాడవ్వవచ్చు. కారణమేదైనా చర్మం పాడవ్వడం వల్ల చర్మం నిర్జీవంగా, అలసటగా, కాంతిహీనంగా, డ్రైగా కనబడుతుంది.
 అలాంటి చర్మం తిరిగి పునరుత్తేజపరచాలంటే, తిరిగి కాంతివంతంగా మారాలంటే మీ వంటింట్లో లేదా ఫ్రింజ్ లో ఉండే కొన్ని పదార్థాలు సహాయపడుతాయి. వాటిని ఎంపిక చేసుకుని, ఉపయోగించుకోవడమే మీ వంతు.
ఎండ, కాలుష్యం, ఒత్తిడి వల్ల డ్యామేజ్ అయిన మీ చర్మం స్థితిస్థాపకతను కోల్పోవడం వల్ల చర్మం వదులుగా, సాగినట్లు కనబడుతుంది.
చర్మంలో కంటికి కనబడని చిన్న ఎలాస్టిక్ ఫైబరస్ కోల్పోవడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. చర్మం కాంతివిహీనంగా, చూడటానికి అసహ్యంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచించి, స్ట్రెత్ తో చర్మంను మరింత డ్యామేజ్ చేసుకోకండి. ఇక్కడ మీకోసం 5 సింపుల్ టిప్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చాలు జీవం కోల్పోయిన చర్మం తిరిగి పునరుత్తేజ పడుతుంది.

ఐస్ :

 ఫ్రిజ్ లో ఉండే ఐస్ క్యూబ్స్ తీసుకుని చర్మం మీద సున్నితంగా మర్ధన చేయాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.
 ఆఫీసుల్లో ఉన్న ఫ్రిజ్ లో కూడా ఐస్ క్యూబ్స్ తీసుకుని, బయట తిరిగి వచ్చన వెంటనే చర్మంపై అప్లై చేసి మసాజ్ చేసుకోవచ్చు. 
ఇలా మసాజ్ చేయడం వల్ల చర్మం పునరుత్తేజం అవుతుంది, కాంతివంతంగా మారుతుంది. ఐస్ క్యూబ్స్ ను రోజ్ వాటర్, కీరదోస, అలోవెర వంటి వాటితో కూడా తయారుచేసుకుని, ప్రయత్నించవచ్చు.

పెరుగు:

 డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రెష్ పెరుగు తీసుకుని , ఫ్రిజ్ లో కొద్దిసేపు ఫ్రీజ్ చేసి తర్వాత బయటకు తీసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.
 ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. డ్యామేజ్ అయిన చర్మాన్ని , బ్రోకెన్ స్కిన్ ఫైబర్స్ ను తిరిగి నయం చేస్తుంది. 

ఎండ వల్ల డ్యామేజై నల్లగా మారిన చర్మం తిరిగి పూర్వస్థితి తీసుకొచ్చే రెమెడీస్


తేనె:

 డ్యామేజ్ అయిన చర్మంను రిపేర్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేసి గుణాలు , యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. తేనెలో యాంటీమైక్రోబయల్ గుణాల వల్ల చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. దాంతో చర్మం తిరిగి స్థితిస్థాపకతను పొందుతుంది. స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

అలోవెర:

 కలబందం అన్ని రకాల చర్మ సమస్యలను ినవారిస్తుంది. చర్మం ఫ్రెష్ గా, కాంతివంతంగా మార్చడంలో కలబంద గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెర జెల్ ఫార్మసీ, బ్యూటీస్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.
 అలోవెర జెల్ ను ఫ్రిజ్ లో ఉంచి , డ్యామేజ్ అయిన చర్మానికి అప్లై చేయాలి. ఇది చాలా త్వరగా చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే స్కిన్ డ్యామేజ్ సమస్యలుండవు. క్లియర్ స్కిన్ పొందుతారు. 

కేవలం 2వారాల్లో మీ చర్మాన్ని ఫెయిర్ గా మార్చే సింపుల్ రెమిడీస్..!!

కొబ్బరి నూనె: 

దీన్ని ట్రై చేసి, టెస్ట్ చేసిన హోం రెమెడీ. కొబ్బరి నూనె కేవలం జుట్టుకు, వంటలకు మాత్రమే కాదు చర్మానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. కొబ్బరి నూనె స్ట్రెచ్ మార్క్స్ ను , ముడుతలను నివారిస్తుంది. చర్మంలో చారలను తొలగిస్తుంది. రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.








Comments