ముఖానికి ‘మీగడ’ పూస్తే..?


''ముఖ సౌందర్యం కేవలం 'సౌందర్య శాలలకు' వెళ్తేనే వస్తుందనుకోవటం పొరపాటు. ముఖ వర్చస్సును పెంపొందించటంలో వంటగదిలో లభ్యమయ్యే పదార్థాలు కీలక భూమికను పోషిస్తాయి. కాస్తంత ఓర్పుతో వీటిని ఉపయోగించుకుంటే మీ ముఖ సౌందర్య రెట్టింపవుతుంది. పలు రకాల వంటింటి చిట్కాలు తెలుసుకోండి మరి''.. - మీగడ ముఖ సౌందర్యానికి దోహద పడుతుంది. తాజా మీగడను ప్రతిరోజు ముఖానికి రాయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాదండోయ్ ముఖం పై వ్యాపించిన నల్లమచ్చలు, ముడతలు తొలగిపోతాయి. - పచ్చిపాలలో నిమ్మరసంతో పాటు ఉప్పును జోడించి రోజుకు రెండు సార్లు ముఖానికి ఆప్లై చేస్తే ముఖం పై పేరుకున్న మలినాలు తొలగిపోతాయి. - నిమ్మరసంలో తేనెను కలిపి ఆప్లై చేస్తే ముఖ చర్మం నిఘారింపును సంతరించుకుంటుంది. - చర్మ సంరక్షణకు మార్కెట్‌లో అనేక రకాల క్రీమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే సహజసిద్ధంగా లభ్యమవుతున్న పదార్థాలను సోందర్య పోషణకు ఎంపిక చేసుకోవటం మంచింది.

Comments