కొంతమందిలో ముఖంలో మచ్చలు, స్పాట్స్, మొటిమలుంటాయి. సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్‌గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు వివిధ రకాల కారణంగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్‌లో వచ్చే మొటిమల కారణంగా ముఖంలో స్పాట్స్ ఏర్పడతాయి. ఇవి మొదట్లోనే నివారించకపోతే గుంటలు పడే ప్రమాదం ఉంటుంది.
మొటిమలతో ఏర్పరడే మచ్చలు చారలుగా ఏర్పడకపోయినా, ఆ మచ్చలు కొంత వరకూ బాధ కలిగిస్తుంది. ఇటువంటి మచ్చలు, చారలను నివారించడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే ఖరీదైన క్రీములను ఉపయోగిస్తే మచ్చలు కొంత వరకూ తొలగిపోయినా, వాటి గుర్తులు చారలుగా చర్మం మీద అలాగే నిల్చి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్తమ హోం రెమడీస్ అప్లై చేయడం ద్వారా మచ్చలను మరియు ఛారలను లైట్ చేస్తుంది. లేదా పూర్తిగా మాయం చేస్తాయి. మరి ఆ ప్రభావంతమైన హోం రెమడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...
మొటిమలతో ఏర్పరడే మచ్చలు చారలుగా ఏర్పడకపోయినా, ఆ మచ్చలు కొంత వరకూ బాధ కలిగిస్తుంది. ఇటువంటి మచ్చలు, చారలను నివారించడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే ఖరీదైన క్రీములను ఉపయోగిస్తే మచ్చలు కొంత వరకూ తొలగిపోయినా, వాటి గుర్తులు చారలుగా చర్మం మీద అలాగే నిల్చి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్తమ హోం రెమడీస్ అప్లై చేయడం ద్వారా మచ్చలను మరియు ఛారలను లైట్ చేస్తుంది. లేదా పూర్తిగా మాయం చేస్తాయి. మరి ఆ ప్రభావంతమైన హోం రెమడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి నిమ్మరసం
1. నిమ్మరసంతో.. ముఖంపై నల్లని మచ్చలకు ముఖ్య కారణం విటమిన్ సి లోపించడమే. రెండు చెంచాల నిమ్మరసంలో చిన్న దూది ఉండను ముంచి ముఖంపై మచ్చలున్నచోట రాయాలి. పది నిముషాల తరవాత చల్లని నీటితో కడగాలి. నిమ్మరసం రాసినప్పుడు ముఖంపై ఎండ పడకుండా చూసుకోవాలి.ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి గంధం పొడితో
2. గంధం పొడితో.. గంధం పొడికి రోజ్‌వాటర్‌ను, రెండు చుక్కల గ్లిజరిన్‌ను కలిపి పేస్టులా చేసుకుని రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మచ్చలూ పోతాయి. చర్మ ఛాయా మెరుగుపడుతుంది.ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి పచ్చి పాలతో
3. పచ్చి పాలతో.. లాక్టిక్ యాసిడ్ ఉండే పచ్చిపాలను ముఖంపై ఉండే మచ్చలకు రాసుకుని రాత్రంతా ఉంచుకొని తెల్లవారిన తరవాత కడిగితే.. మచ్చలు తగ్గుముఖం పడతాయి. అలాగే చెంచా మజ్జిగలో చెంచా నిమ్మరసం కలిపి మచ్చలపై రాస్తే క్రమంగా మచ్చలు మటుమాయమవుతాయి.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి కలబంద గుజ్జుతో
4. కలబంద గుజ్జుతో.. కలబంద గుజ్జును మచ్చలపై రాసి, అరగంట తరవాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మచ్చలు పోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి పెరుగు
5. పెరుగుతో.. చెంచా పెరుగుకు రెండు చెంచాల ఓట్‌మీల,ü చెంచా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకుని అరగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజుకోసారైనా చేస్తుంటే చర్మంపై పేరుకున్న నలుపుదనంతో పాటూ మచ్చలూ మాయమవుతాయి.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి పసుపు :
6. ముఖంలో ఎలాంటి సమస్యనైనా నివారించి.. చర్మాన్ని ఫెయిర్ గా మార్చడంలో పసుపు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పసుపు పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకోసం ఇంట్లోనే చక్కటి ఫేస్‌ప్యాక్ అప్లై చేయవచ్చు. ఒక టేబుల్‌స్పూన్ పసుపులో సరిపడా పాలు మిక్స్ చేసి పేస్ట్‌లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి పుదీనా :
7. పుదీనా ఆకులను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కాస్త పసుపు వేసి గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండుమూడు సార్లు ఈ ప్యాక్ అప్లై చేస్తే వమృదువైన చర్మం సొంతం అవుతుంది.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి కొబ్బరి నూనె :
8. కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకుని ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనె బదులుగా మరే ఇతర నూనెనయినా వాడవచ్చు.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి కరివేపాకు :
9.కరివేపాకులో చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసి మచ్చల మీద రాసి పదిహేను నిమషాల తర్వాత కడగాలి
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి తులసి-వేప:
10. ఎండిన తులసి, వేప, పుదీన ఆకులు ఒక్కొక్కటి వందగ్రాములు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుని నిలవ ఉంచుకోవాలి. వాడేటప్పుడు రెండు టీ స్పూన్ల పొడిలో తగినంత పన్నీరు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి కీరదోసకాయ
11. దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే గీతలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం బిగుతుగా కూడ ఉంటుంది.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి టమోటో:
12. టమోటో గుజ్జు అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. టమోటోలో ఉండే ఎఫెక్టివ్ పదార్థాలు, స్కార్స్ ను తొలగిస్తుంది. టమోటో గుజ్జును మెత్తగా చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో స్కార్స్ తొలగిపోతాయి.
ముఖంలో నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి బంగాళదుంప:
బంగాళదుంప చర్మానికి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కళ్ళ క్రింది డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. స్కార్స్ ను నివారించడంలో అత్యంత ఎపెక్టివ్ అయినటువంటి హోం రెమెడీ. పచ్చిపొటాటోను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
Comments
Post a Comment